భగవంతుని మాయ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 నేను మతాంతర వివాహం చేస్తున్న సందర్భంగా గోరా గోపరాజు రామచంద్ర రావు గారి ప్రాంగణంలో జరుగుతున్న కార్యక్రమానికి  వారి పెద్దబ్బాయి లవణం గారిని కూడా ఆహ్వానించాం  మొన్ననే శ్రీలంక వెళ్లి వచ్చాను  భగవంతుని దయవల్ల  ప్రయాణం చాలా చక్కగా సాగింది అన్నారు  ఆయన హేతువాది  దేవుడు భగవంతుడు అంటే నమ్మకం లేదు  అది  మాటల్లోనేనా చేతలలో కాదా అన్న దానికి సమాధానం లేదు మనకు  వివేకానంద స్వామి కుటుంబ బాధ్యతలతో సతమతమవుతున్న రోజులలో  కాషాయం కట్టిన ప్రతి ఒక్కరి పాదాలకు నమస్కరించి  నాకు దైవ దర్శనం కావాలని  ప్రార్థిస్తే  కడుపు నింపుకోవడానికి ఈ కాషాయాన్ని కట్టం తప్ప  నిజమైన యోగులం కాదు  అని చెప్పడం ఆ సాధు నిజాయితీకి నిదర్శనం. వేమన అనేకమంది ఇలాంటి దొంగ సాధువులను గమనించి  వ్రాసిన ఆటవెలదిలో చెప్పిన విషయం  బోడి గుండు చేయించుకుని  విబూది  బొట్లు శరీరమంతా పెట్టుకుని  కాషాయం కట్టి  తనకు ఏమీ తెలియకపోయినా ఒక మూల కూర్చుని ఏదో  తనకు తెలియని విషయాలను కూడా చెబుతూ ఉంటే ఆ వేషానికి మోసపోయి అతని చుట్టూ చేరి భజన చేస్తూ  అతనిని ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగుడుకుంటూ కూర్చుంటే  అతను నిజమైన యోగిగా  ప్రవర్తించగలడా  అన్నది వేమన ప్రశ్న  మానసిక స్థితి వేరు భౌతిక  పద్ధతి వేరు  పైపై మెరుగులను చూసి మోసపోయి  జీవితాలనే నాశనం చేసుకుంటూ ఆస్తిపాస్తులు  అతని మాయలో పడి ఖర్చు చేసిన వాడు చాలా మంది ఉన్నారు అలాంటివారిని నమ్మవద్దు అంటాడు వేమన. ఆత్మ శుద్ధి లేని ఆచారం ఎందుకు అని ప్రశ్నించాడు ఒక చోట వేమన  నిజమైన దైవ దర్శనాన్ని పొందాలి అంటే  ఇలాంటి వేషాలకు   అవకాశమే లేదు  ఒంటి చుట్టూ కషాయం చుట్టుకొని  ముతక చీరలు ధరించి  కడుపు నింపుకోవడానికి  బిక్షం అడుగు కోవడానికి  పనికి వస్తున్నది తప్ప  నిజంగా భగవంతుని సాక్షాత్కారం పొందాలి అని మనసులో కోరుకుని  పంచేంద్రియాలు తన స్వాధీనం చేసుకుని  దీక్షతో సమాధి స్థితికి వెళ్లి  మనసును లగ్నం చేసి  దైవభక్తిలో నిమగ్నమై ఉంటే అప్పుడు వారికి దర్శనం జరుగుతుంది తరువాత ముక్తికి అర్హుడు అవుతాడు తప్ప  ఇలాంటి వేషాల వల్ల మాత్రమే కాదు అని నిష్కర్షగా చెబుతున్నాడు వేమన వారు రాసిన ఆ పద్యాన్ని చదవండి.

"కంబళములు గట్టిగంతలు గజ్జలు బోడి తలలు కాలి బొంత చీరలాత్మ దేవ పూజలని సేయనేరవు..."

కామెంట్‌లు