కబుర్ల దేవత- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 కబుర్ల  దేవత అన్న పేరుతో  డాక్టర్ గంగిశెట్టి శివకుమార్  వ్రాసిన చిన్న పిల్లల కథలు  చిన్న పిల్లలకు అర్థమయ్యేపద్ధతిలో రాయడం అసిధారావ్రాతం లాంటిది  వారి చిన్ని మనసుకు అర్థమయ్యే భాషను ఉపయోగించాలి  చదివించగలిగిన సత్తా ఆ కథకు  ఉండాలి  చదివిన తర్వాత ఇలాంటి కథ నేను కూడా వ్రాయవచ్చు కదా అన్న అభిప్రాయం వారిలో కలగాలి  అలాంటి స్ఫూర్తినిచ్చే కథలు  శివకుమార్ గారు రాయడం ముదావహం  కొంతమంది చదువరులు  ఆస్తికత్వాన్ని ప్రబోధించే దేవతగా  అభి వర్ణిస్తూ  ఇలాంటివి పిల్లలకు అవసరమా  అన్న ప్రశ్నకు  సమాధానంగా నడిచిన కథలు  కబుర్ల దేవత  దేవుడు భగవంతుడు అన్న పదాలు  మనం చెప్పే అర్థంలో కాకుండా  శబ్దార్థం  తీసుకొని దానికి జీవం ఇచ్చినవాడు రచయిత. దివ్ అంటే జ్ఞానం  దానిని కలుగ చేసేది దేవత దేవుడు  ఆ అర్ధాన్ని మనం విస్మరిస్తాం  కథ కానీ నవల కానీ  ప్రబంధ రచనలు ఏవైనా  సరే సమాజానికి  హితాన్ని చెప్పడం కోసమే సాహిత్యం ఏర్పడింది  వాల్మీకి మహర్షి  వ్యాసుల వారు ఇంతకాలం భూమి మీద బ్రతికి ఉన్నారు అంటే కారణం  వారి సమాజ స్పృహ  ఆ ఆలోచనతోనే  ఈ రచయిత చక్కటి విషయాలను  పిల్లల మనసుకు హత్తుకునేలా  అది చదివిన తర్వాత స్ఫూర్తి చెంది  పెద్దలతో కూడా చదివిస్తారనడంలో సందేహం లేదు  జ్ఞానానికి  వయోపరిమితిలేదు  సమాజానికి హితం చెప్పడానికి  బాలుడు చెప్పినా  చిలుక చెప్పినా విన తీరవలసినదే అని కాళిదాసు చెప్పిన మాట  దానిని నిజం చేస్తూ బాలల తత్వం తెలిసిన  గంగిశెట్టి వారు ప్రతి కథను చక్కగా మలచడం వారి మేధస్సుకు  గుర్తు. శివకుమార్ గారు పరిశోధన గ్రంథం రాసినా కథలు రాసినా చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకుని వారి కోసం వ్రాసినవే అవి. బాల అన్న శబ్దానికి మనకు తెలిసిన అర్థం వయసులో చిన్నవాడు అని  కానీ బాల వ్యాకరణం రాసిన పరవస్తు చిన్నయ్య సూరి గారు పండితులకు చెప్పిన అర్థం  ధారణ సాధన కలిగిన వారు అని  గురువుగారు చెప్పిన ఏ విషయాన్ని  అయినా శ్రద్ధగా విని దానిని మెదడులో ఉంచుకొని మధ్య మధ్యలో  మననం చేసుకుంటున్న వాడిని  బాలుడు అంటాడని  ఏ రచయిత అయిన ఒక రచన చేసేటప్పుడు  సమాజానికి ఒక సవాలు విసరడం కాకుండా  దానికి సమాధానం కూడా చెప్పాలి  ఒక సమస్యను ఎత్తి చూపినప్పుడు  దాని పరిష్కారాన్ని కూడా  రచయితే చెప్పడం తన బాధ్యత  ఈ రెండు బాధ్యతలను  సక్రమంగా పాటిస్తూ  ప్రతి కథ  బాలల మనసుల్లో శాశ్వతంగా నిలిచేలా వ్రాసిన రచయిత  ధన్యుడు. ఇప్పటికే బాలల కథలు అన్న శీర్షిక పరిశీల ఆత్మక పరిశోధనాగ్రంథాన్ని వ్రాసిన  శివ కుమార్ గారు  మానసికంగా సాత్విక, రాజస  తామస భావాలను విశ్లేషిస్తూ  వ్రాస్తే బాగుంటుందని నా సలహా ఇంత అందమైన అవసరమైన కథను రాసిన  చిరంజీవి వయసులో నా కన్నా చిన్నవాడు కనక ఆశీస్సులతో... 
కామెంట్‌లు