నండూరి రామ్మోహన రావు గారి పేరు చెప్పగానే వారి వినయ విధేయతలు జ్ఞాపకం రాక మానవు. వారు ఎక్కడకు వెళ్ళినా చిన్న పెద్దా అన్న తేడా లేకుండా అందరినీ గౌరవించే తత్వం విద్యా వినయ సంపన్నుడు అంటే నండూరి వారే అని ప్రతి ఒక్కరూ అనే మాట వారి జీవితంలో వారికి కలిసి వచ్చిన అదృష్టం సహజ సిద్ధంగా వారికి ఉన్న అభి రుచితో పాటు నార్ల వెంకటేశ్వరరావు గారితో కలిసి పని చేయడం పత్రికారంగంలో పత్రిక ఎలా నడపాలి అన్న విషయాన్ని నార్ల వారి నుంచే నేర్చుకోవాలి ఎవరైనా అప్పటికే ఎంతో ప్రాచుర్యం పొందిన ఆంధ్ర పత్రిక ఆంధ్ర ప్రభల స్థాయిని దాటి ఆంధ్రజ్యోతికి ప్రత్యేక స్థానాన్ని కల్పించిన వారు నార్ల వెంకటేశ్వరరావు గారు వారి వల్ల పత్రికకు పత్రిక వల్ల వారికి పేరు ప్రఖ్యాతులు లభించాయి అని చెప్పడం అతిశయోక్తి కాదు. మా గురువుగారు నండూరి సుబ్బారావు గారికి అతి సన్నిహిత బంధువు ఆకాశవాణి కేంద్రానికి దగ్గరలోనే వారి నివాసం ఎప్పుడు మాకు సమయం ఉన్నా వారింటికి వెళ్లి సాహిత్య కార్యక్రమాలతో కాల క్షేమం చేసేవాళ్ళం ఎవరు ఏ ప్రశ్న అడిగిన ఏమాత్రం విసుగు చెందకుండా అడిగిన వ్యక్తి స్థాయిని బట్టి అతనికి అర్థమయ్యే స్థితిలో వివరించడానికి ప్రయత్నం చేస్తారు ఆయన. ఒక్కొక్కసారి మాతో పాటు లతగారు కూడా వచ్చేవారు లత గారు వారిని ఇరుకున పెట్టడానికి స్త్రీలకు సంబంధించిన విషయాలను అడిగింది అడిగిన వెంటనే ఆయన చక్కటి సమాధానం చెప్పేవారు ఆయన మాటల్లో మన సంస్కృతి మన సంప్రదాయం మన నడవడిక మన సంస్కారం గురించి చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న రామ్మోహన్ రావు గారు ఎప్పుడు వారి ప్రసంగాన్ని చదవడానికి కానీ ఏవైనా సమీక్షలు ఇవ్వడానికి కానీ వచ్చేవారు కాదు ఆ విషయాన్ని స్పష్టంగా రాశి పంపుతూ ఇది ఆనంద్ తో చదివించండి నాకన్నా వారు ఆ ప్రసంగానికి జీవాన్ని ఇవ్వగలరు అని రాసేవారు గోష్టి గాని చర్చ గాని జరిగితే దానికి తప్పకుండా వారు వచ్చేవారు ఎదుట ఎంత గొప్ప సాహితీవేత్త ఉన్నా రామ్మోహన రావు గారు ఎలాంటి సంకోచం లేకుండా శాస్త్రీయ పద్ధతిలో సమాధానాలు చెప్పడానికి వెనుకాడే వారు కాదు చర్చా కార్యక్రమంలో వారు వస్తున్నారు అని తెలిసి కొంతమంది కార్యక్రమానికి డూమ్మా కొట్టిన వారు కూడా ఉన్నారు అలాంటి ప్రజ్ఞ ఆయన సొంతం నిర్మొహమాటంగా మాట్లాడడం వారి నైజం.
ప్రజ్ఞాశాలి నండూరి -ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి