సమాజంలో కలిమి తో అష్ట ఐశ్వర్యాలు అనుభవించే వ్యక్తులు కొంతమంది ఉంటే ఆ పూట భోజనానికి లేక బాధపడేవారు మరి కొంతమంది ఉంటారు కాయ కష్టం చేస్తే తప్ప కడుపు నిండనివారు ఎలాంటి బాధలకు లోనవుతాడో అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది కన్యాదానమని, విద్యాదానమని దానాలలో అనేక రకాల దానాల గురించి మనం వింటూ ఉంటాం దానిలో ఏ దానం గొప్పదో చెప్పమంటే కష్టం దేనికి అదే గొప్పది కన్య లేకుంటే జీవితం లేదు చదువు లేకుంటే బుద్ధి లేదు కానీ అన్నం తినకపోతే ఎన్ని రోజులు బ్రతుకుతాడు ఉపవాసంతో ఉండి మంచి నీళ్లతో పడుకునించుకోవాలి అలా ఎన్ని రోజులు బతుకుతాడు కనుక అన్నదానం దానాలన్నిటిలోకి గొప్పది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు.
అన్నం తిని ప్రాణాలు నిలుపుకున్న ఆ జీవి చేయవలసిన కర్తవ్యం ఏమిటి అని ఆలోచిస్తే భవిష్యత్తు జీవితమంతా అంధకారమయం గా కనిపిస్తుంది ఈ జీవిత పరమార్ధం ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా గురువును చేరి తనలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి విజ్ఞానాన్ని కలుగ చేసి జీవిత ధ్యేయం ఏమిటో తెలియజేయమని దానికి మార్గాన్ని సూచించమని ప్రాధేయపడతాడు ఆ గురువుగారు తనను శిష్యునిగా స్వీకరించి తాను ఏది చేస్తూ ఉంటే దానిని పరిశీలనగా చూస్తూ దానిని ఆ పద్ధతిలో చేయడానికి ప్రయత్నించండి మొదట్లో కష్టంగానే ఉంటుంది ఆ తరువాత సాధన ఫలితంగా అలవాటైపోతుంది ఆ తర్వాత ఏం చేయవలసింది నీకు అర్థం అవుతుంది అని గురుబోధ చేసి తన వద్ద ఉంచుకుంటాడు.
ఎలా కూర్చోవాలో తెలియనివాడు ఆసనం వేయడం అంటే ఏమిటో ఆ పద్ధతిని ముందు తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించేస్తాడు పద్మాసనం వేసుకుని కూర్చుని తరువాత ధ్యానం లో నిమగ్నమై జీవితంలో సాధించదల్చుకున్న జ్ఞానాన్ని మొత్తానికి సంబంధించి తన మనసును స్వాధీనపరుచుకోవడానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కుండలి నుంచి సహస్రారం వరకు వచ్చి తనలో ఉన్న మూర్ఖత్వము అనే చీకటిని తొలగించుకొని వెలుగు కోసం ప్రయత్నిస్తూ జ్యోతిని చూడడం కోసం ప్రయత్నం చేస్తాడు కానీ ఇవన్నీ చేయడం ఎంత కష్టమో తెలిసి మధ్యలో వదిలేసిన వాడు దివిజుడు ఎలా అవుతాడు అలా శూద్రత్వం లోనే మగ్గిపోతాడు అని చెప్తున్నాడు వేమన వారు చెప్పిన పద్యాన్ని చదవండి.
"ఆసనం బెరుగక నా మర్మ కర్మంబు గురువుచేత దెలసి గూర్చకున్న మనసు నిల్పకున్న మరి ద్విజుడెట్లగు..."
ద్విజత్వం- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి