ఆదర్శ జీవి సుబ్బారావు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 విద్యా వనంలో పనిచేస్తున్న రోజుల్లోనే కమ్యూనిస్టు సాహిత్యం అధ్యయనం చేసి  దస్ కాపిటల్ అన్న పేరుతో  మార్క్స్ రాసిన సిద్ధాంత గ్రంథాన్ని చదివి దానిలో ఉన్న అన్ని విషయాలు వారికి  అద్భుతం అనిపించేలా  ఉండి  ఆ విషయాలను సామాన్య ప్రజలలో కూడా వ్యాప్తి చెందేలా  ప్రయత్నం చేయాలన్న అభిప్రాయంతో  పెద్దలను సంప్రదించి కమ్యూనిస్టు పార్టీలో చేరడం  ఆయన జీవితంలో  మొదటి   మార్పు  స్వచ్ఛమైన దేశభక్తికి తోడు ప్రజలందరికీ శాంతి సౌఖ్యాలతో కూడిన జీవితం ఉండాలనే  సహజమైన మానవతా దృష్టి కమ్యూనిస్టు  సాహిత్యం అధ్యయనం ద్వారా ఏర్పడిన  నిండు చైతన్యం పరిపూర్ణ బాధ్యత  విప్లవ కార్యాచరణ ఆయనలో పెనవేసుకొని పోయాయి. ఏదైనా విషయం ప్రచారం కావాలి అంటే స్త్రీ సహకారం ఉండి తీరవలసినదే  వారి మనసుకు నచ్చిన పద్ధతిలో ఆదర్శాలను వారికి  వారి భాషలో అర్థం అయినట్లుగా చెప్పినట్లయితే  ఒక స్త్రీ  వందల మంది  స్త్రీలను మార్చడానికి అవకాశం ఉంటుంది  ఆ దృష్టితో తన కన్నతల్లిని విప్లవమాతగా తన  అర్ధాంగిని విప్లవ గృహిణిగా తయారు చేశారు  ఆయన విప్లవ కార్యాచరణ పరిరక్షణ చూసిన కమ్యూనిస్టు పార్టీ జిల్లా రాష్ట్ర నాయకత్వం వారు తీసుకున్న ప్రతి నిర్ణయానికి  కట్టుబడి  దానిని ప్రచారం చేయడంలో  తన సాయశక్తుల ప్రయత్నం చేస్తున్న కృషి  నాయకత్వానికి బాగా నచ్చింది  వారిని అభినందించడంతోపాటు  1941లో ఆయనను గన్నవరం తాలూకా ఆర్గనైజర్ గా నియమించింది.
చిత్త శుద్ధితో అవిశ్రాతంగా పనిచేసినప్పుడే నెమ్మదిగా  పేరు పొందుతుంది గన్నవరం తాలూకా కమ్యూనిస్టు పార్టీని బలమైన పార్టీగా నిర్మించగలిగారు  రెండేళ్లలో పార్టీ నిర్మాణానికి ఉద్యమాభివృద్ధికి  చేసిన కృషిని పరిశీలించిన పార్టీ ఆయనను కృష్ణాజిల్లా నాయకత్వంలోకి ప్రమోట్ చేసింది  1943 లోనే పార్టీకి ఆయన ఆస్తినంతా ఇచ్చారు  49 సెప్టెంబర్ లో మచిలీపట్నంలో సుబ్బారావు గారు సమ్మె చేస్తే కడలూరు సెంట్రల్ జైలుకు పంపించారు  అక్కడ కూడా  పార్టీకి సంబంధించిన తరగతులను ఏర్పాటు చేశారు  అనేకమందిని చైతన్యవంతం చేసి  వారిలో త్యాగనిరతిని మెరుగుపరచడానికి విశేషమైన కృషి చేశారు  1964 నుంచి 74 వరకు చనిపోయే వరకు కృష్ణాజిల్లా పార్టీ కార్యదర్శి గానే ఉన్నారు  అలాంటి ఉత్తమ నాయకుడు  అందరికీ ఆదర్శప్రాయుడు.

కామెంట్‌లు