బాలల సందేహాలు;- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580.
కోయిలేమో నల్లన
కంఠమేమో తీయన
పెద్దలూ!..చెప్పండి!!
సందేహం తీర్చండి!!

దుఃఖంలో కన్నీరు
మోదంలో కన్నీరు
ఎందువలన చెప్పండి!!
ఉన్న గుట్టు విప్పండి!!

గోవులేమో ఎర్రన
పాలు ఏమో తెల్లన
ఎందువలన!చెప్పండి!!
అనుమానం తరమండి!!

పిట్టయేమో కొంచెము
కూత ఏమో కడు ఘనము
అక్షరాల నిజమండి!
తక్షణమే చెప్పండి


కామెంట్‌లు