బాలిక గృహమున దీపిక;- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,-9966414580.
ఇంటిలోని బాలిక 
మింటిలోన తారక
ఆదరిస్తే మనము
అవుతుందోయ్! దీపిక

సదనంలో అందము
పరిమళించు గంధము
ప్రేమతో మల్లెలా
వేస్తుందోయ్! బంధము

చదువుకున్న బాలిక
వెలుగులీను దీపిక
తెస్తుంది గౌరవము
పంచును అనురాగము

అదృష్టమే బాలిక
చిన్న చూపు చాలిక
వివక్ష తొలగిపోయి
ఎదగాలని  కోరిక

ఇంటిలోన కళకళ
తారల్లా మిలమిల
బాలిక లేకపోతే
జగమంతా వెలవెల

వద్దు పక్షపాతం
అభివృద్ధికి విఘాతం
ఆడపిల్ల ఎదిగిన
కడు వర్ణశోభితం


కామెంట్‌లు