చక్కగ పాడును కోయిల
హాయిగ ఊగును ఊయల
మధురముగ మ్రోగును తబల
అబల కాదు మహిళ సబల
భారత శాస్త్రీయ సంగీత
వాయిద్య పరికరము తబల
హిందుస్థానీ సంగీత
సీమలో గొప్పది తబల
వ్రేళ్ళకు మంచి వ్యాయామం
దాని శబ్దం మాధుర్యం
జోడుగా ఉండును తబల
వీనులవిందు చేయు తబల
చర్మ వాయిద్యం తబల
వాయిస్తే ఇక గలగల
పరవశమే కల్గించును
మధురిమలు చవి చూపించును
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి