మల్లెపూలు;- -గద్వాల సోమన్న,9966414580
మల్లెపూలు తెల్లన
ముట్టుకున్న మెత్తన
వాటి మేలు ఎక్కువ
మగువలకూ మక్కువ

విరిసిన గుబాళింపు
సిగలోన బహు సొంపు
మల్లెపూల మాలలు
మెడలోన సొగసులు

మల్లెతీగ ప్రాకును
అందాలను కూర్చును
అందరికీ ఇష్టము
సేవలోన శ్రేష్టము

దేవుని పూజలోన
ప్రాముఖ్యత వహించును
సన్మాన సభలోన
గౌరవాన్ని పెంచును

త్యాగానికి ప్రతీక
మహిలో మల్లెపూలు
స్వచ్ఛమైన తెలుపుకు
మల్లెలు ఆనవాలు


కామెంట్‌లు