కవులకు కైమోడ్పులు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
వెలుగులు
వెదజల్లేవారికి
వందనాలు

పరిమళాలు
ప్రసరించేవారికి
ప్రణామాలు

పువ్వులు
చల్లేవారికి
ప్రాంజలులు

నవ్వులు
చిందించేవారికి
నమస్కారాలు

అందాలు
చూపేవారికి
అభినందనలు

ఆనందము
కలిగించేవారికి
అంజలులు

అనుభూతులు
అందించేవారికి
అభివాదాలు

సమయం
సద్వినియోగంచేయించేవారికి
సలాములు

కడుపు
నింపేవారికి
కృతఙ్ఞతలు

దాహము
తీర్చేవారికి
దండాలు

చదువుటకు
సదావకాశమిచ్చినవారికి
సన్నుతులు

పాఠాలు
నేర్పేవారికి
ప్రణతులు

కవితలు
కూర్చేవారికి
కైమోడ్పులు


కామెంట్‌లు