శ్రీ రాముడు ; - కొప్పరపు తాయారు
తం వ్రజంతం ప్రియో భ్రాతా లక్ష్మణః ఆను జగామహ !
స్నేహాత్ వినయ సంపన్నః సుమిత్ర ఆనంద వర్థనః !

బ్రాతరం దయితో భ్రాతః సౌభాత్రం అనుదర్శయన్ !
రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణ సమాహితా
 జనకస్య కులే జాతి దేవ మాయేవ నిర్మితా !
సర్వ లక్షణ సంపన్నా నారీణాం  ఉత్తమా. వధూః !

సుమిత్ర సుతులైన లక్ష్మణుడు శ్రీరామునకు ప్రియ సోదరుడు మిక్కిలి వినయ సంపన్నుడు రాముని యందు భక్తి తత్పరుడు అన్న అడవులకు బయలుదేరుచుండగా నేహాతిరేకమున  లక్ష్మణుడు ను ఆయనను అనుగమించెను.

జనకుని వంశమున జనకుని ఉంచుమున పుట్టిన సీత దేవి దేవి శ్రీరామునకు ధర్మపత్ని ఆమెపై ఆయనకు గల ప్రేమ అపారము ప్రాణసమానురాలు దేవ మాయ వలె (దేవతలను సైతం మోహింపచేసిన వేసిన మోహిని వలె) అపూర్వ మైన సౌందర్యం కలది. సర్వశుభ  లక్షణ శోభిత దశరధుని కోడలు, స్త్రీలలో ఉత్తమురాలు.ఆమెయు చంద్రుని రోహిణి వలె శ్రీరాముని అనుగమించెను.


కామెంట్‌లు