మహోన్నతుడు!;- పద్మావతి ‌పి-హైదరాబాద్
కలలకు రూపం కల్పించావు
ఆశల దీపం వెలిగించావు
సాధారణ వ్యక్తిగా పెరిగావు
అసాధారణ ప్రతిభను కనబరిచావు..

సమయం విలువను గుర్తించావు
స్థైర్యం ధైర్యం జాతికి కల్పించావు
కృషియె భవితకు బాటంటూ బోధించావు
ఎంతెత్తుకు ఎదిగినా వొదిగగొదిగి ఉన్నావు..

వ్యక్తిగా ప్రతిభను చాటావు
ఆడంబర రహితంగా జీవించావు
విజ్ఞానమె ప్రగతికి వరమన్నావు
ప్రథమ పౌరునిగా పదవిని చేపట్టావు..

ఆకాశం హద్దుగా పరిశోధించావు
మిస్సైల్ గా గగనానికి ఎగిరావు
బాలల భవితకు బంగరు బాటలు వేసావు 
వారి నవ్వుల పువ్వుల విరి జల్లుల మురిసావు..

విద్యయె ప్రగతికి బలమన్నావు 
యుక్తితో మేథాశక్తిగా నిలిచావు
భారతరత్నగా బ్రహ్మాస్త్రం సాధించావు
ధ్యానం ధ్యేయం శ్రద్ధాభక్తుల
జీవితం కొనసాగించావు
దేశం కోసమే జీవన సర్వస్వం అర్పించావు

ఆదర్శంగా జీవించావు
సాధనలో బోధనలో మణిభూషణ మయ్యావు 
జీవన లక్ష్యం సాధించావు
అమరుడువై మా మనసుల్లో నిలిచావు..
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

కామెంట్‌లు