శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 విద్య అంటే అధ్యయనం చదవడం రాయడం అక్షర జ్ఞానం సంపాదించడం డిగ్రీ తో ఉద్యోగం..ఇదీ నేటి మన అభిప్రాయం.ఉర్దూలో ఇల్మ్ అంటారు.వేదాలప్రకారం పరావిద్య(ఆత్మ విద్య బ్రహ్మ విద్య) అపరావిద్య( వేద వేదాంగాలు).అధర్వణవేదం ప్రకారం ప్రకృతి విద్య ఆత్మ విద్య బ్రహ్మ విద్య అని 3రకాల విద్యలు. మానవ ధర్మాల ప్రకారం అన్వీక్షకీ త్రయీ వార్త దండనీతి అని 4విద్యలు.ఇంకా 11విద్యలున్నాయి.వ్యాకరణం గంధర్వ వేదం సాముద్రిక వైద్యక అస్త్ర విద్యా యోగశాస్త్రం భక్తి శాస్త్రం రుద్రయామల తంత్రమంత్రశాస్త్రాలు స్వరోదయ ఇంకా ఎన్నో కథలు.భృగుసంహితప్రకారం 32విద్యలున్నాయి.వృక్ష పశు మనుష్యవిద్య సంసేచనవిద్య సంహరణ స్థంభన హ్నతి భస్మీకరణ సంకర పాథేయ తరీ నౌవిద్య నౌకావిద్య అధ్వ పయ ఘంటాపథ సేతుశకుంత విమాన విద్య వాసో కుట్టీ మందిర ప్రసాదవిద్య దుర్గవిద్య కూట ఆకార యుద్ధ ఆయణ రాజాలయ విద్యలు నగరరచన 
వనోపవన దేవాలయ విద్య.
ద్యూతం పుస్తక శుశ్రూష నాటకం పై ఆసక్తి స్త్రీ పై ధ్యాస బద్ధకం నిద్ర విద్యకి భంగం విఘ్నం కలిగిస్తాయి.గురుసేవ చేయకపోవటం త్వరా ఆత్మ శ్లాఘా విద్యలు శత్రువులు.అభిమానం క్రోధం ప్రమాదం రోగం బద్ధకం విద్య కి ఆటంకం కల్గిస్తాయి.ఆస్తా జిజ్ఞాస శిష్టత ఏకాగ్రత జ్ఞానితో సంబంధం కలిగి ఉంటే విద్య త్వరగా వస్తుంది.నారదీయపూర్వ ఖండం అనుసారం దురాగ్రహి బద్ధకస్తుడు రోగి చంచలుడు విద్య చేత వంచింపబడతాడు.విద్యాపీఠ్ అంటే కళాశాల అని అర్థం 🌹
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం