ఏంచూస్తున్నారు? అచ్యుతుని రాజ్యశ్రీ

 బాపూజీ! శాస్త్రీజీ! ఏంచూస్తున్నారు? 
చౌరస్తాలో నిలబడి పాలాభిషేకం చేస్తున్న జనాల్ని చూస్తూ కన్నీరు కారుస్తున్నారా?
గాంధీ పుట్టిన దేశం లో బ్రాందీ ఏరులై పారుతోంది
పట్టపగలే కుటుంబ సభ్యులే 
తమవారి కుత్తుకలు కోస్తుంటే
రైతన్నలు లబోదిబో ఏడుస్తుంటే
ఎవరికివారు మేమేగొప్పని ఎగిరెగిరి పడుతుంటే
సత్యం అహింసను పక్కకు నెట్టేసి గబ్బు కుళ్లు రాస్తాలపై
అవినీతి అన్యాయం చేసే నాట్యం చూస్తూ విస్తుపోతున్నారా!?
శాస్త్రీజీ!నీకుటుంబం ఊసే లేదు
జైజవాన్ జైకిసాన్ నినాదాలు
ఊకదంపుడు ఉపన్యాసాలు
మీ పుట్టిన రోజున ఇవే గారడీలు నివాళులు 🌷
కామెంట్‌లు