సబబు;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఊహ తెలియని వయసు 
అంతా తనవారే అనే భావన
మాయమాటలకు లొంగే అమాయకత్వం
వెరసి ముక్కుపచ్చలారని పాప!
వేలుపట్టి నడిపిస్తాడనుకున్న మనిషి
రాక్షసుడై తనను పీడిస్తాడని తెలియనిది
వింతపశువుచేసే వికృతక్రీడకు 
బలిపశువు అవుతున్నది!
మగతనంబలిసిన ఆంబోతు అకృత్యాలకు 
పూలచెండై నలుగుతున్నది
ప్రేమ కరుణ దయ జాలి 
తెలియనిమృగం చేసే దుశ్చర్యలకు
ఆహుతి అవుతున్నది!
తల్లిపాలుతాగినప్పుడు 
చెల్లినిఎత్తుకున్నపుడు
అక్కలాలించినపుడు 
వాళ్ళుచూపిన ప్రేమ 
వాడికి అర్థం కాలేదు!
తన తల్లీ చెల్లీ అక్కా 
ఈ పాపలకుండేశరీరంతోనే ఉన్నారని 
గ్రహించలేని మూర్ఖుల నీచపుచేష్టలకు 
పతనమవుతున్నది!
ఎదిగి, పుష్పించి, ఫలించి 
మరోజీవికిజన్మనిచ్చే
అవకాశం లేకుండా మొగ్గలోనే 
నలిపేస్తున్నదుష్టులను
ఇక ఉపేక్షిస్తే లాభం లేదు 
ఈమృగాళ్ళకు ఈలోకంలో
స్థానం లేకుండా చేయడమే సబబు!
*********************************

కామెంట్‌లు
Joshi Madhusudana Sharma చెప్పారు…
మంచి కవిత. అభినందనలు సార్ 👌👏👏🌹🙏🌹