హిందీ లో విశ్రాంత్ అంటే అలిసిపోయిన అని అర్థం.కానీ సంస్కృతం లో ఇది భిన్నంగా ఉంటుంది.విశ్రామం విశ్రాంతి అని అర్థం.రెస్ట్ అని మనం ఆంగ్లంలో అంటాం.విశ్రమించటంకోసం ఆగటం అని అర్థం.ఆగటం అన్న అర్ధం బదులు అలిసిపోయిన అని వాడుకలోకి వచ్చింది.రిటైర్మెంట్ ని కూడా విశ్రాంత ఉద్యోగి అనే వాడుతున్నారు.విహంగావలోకనం అంటే పక్షిలాగా అలా ఒక్క సారి చూపు సారించడం అన్నమాట.
సంస్కృతం లో ఈపదం లేదు కానీ హిందీ లో ఉంది.ఆంగ్ల బర్డ్స్ ఐ వ్యూ బర్డ్స్ ఐ ద్వారా హిందిలోకి వచ్చింది అని చాలా మంది అభిప్రాయం.ఆకాశంలో ఎగిరే పక్షికి భూమి పై వస్తువులు కన్పడ్తాయి. కానీ స్పష్టం గా కన్పడవు.అందుకే విహంగావలోకనం విహంగమదృష్టి అనే పదాలు వాడుకలోకి వచ్చాయి 🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి