పదలాలిత్యం;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పదాలతో
ఆడుకుంటా
పెదాలతో
పలికించుతా

పదాలను
పద్ధతి
ప్రకారం
పేరుస్తా

పదాలను
నిర్దేశించిన
క్రమంలో
పొసుగుతా

పదాలను
ఒకే
రీతిలో
నడిపిస్తా

పదాలను
వరుసలోవాడి
పంక్తులను
నిర్మాణంచేస్తా

పదాలను
లయాత్మకంగా
సంధించి
పఠింపజేస్తా

పదాలకు
ప్రాసలు
జోడించి
పాడించుతా

అరుదైన
పదాలనువాడి
వాడుకను
పెంచుతా

చచ్చిన
పదాలకు
ప్రాణంపోసి
బ్రతికిస్తా

కొత్త
పదాలను
సృష్టించి
ముందుంచుతా

పదాలను
వండి
వార్చి
వడ్డించుతా

పదాలను
నాటి
పెంచి
పండిస్తా

పదాలను
వెలిగించి
కాంతులు
చిమ్మిస్తా

పదాలకు
పూలుపెట్టి
అందాలను
చూపిస్తా

పదాలకు
పరిమళాలద్ది
పీల్చేవారికి
ప్రమోదంకలిగిస్తా

పదాలకు
తేనెనుపూచి
పెదవులకుతాకించి
చప్పరింపజేస్తా

పదాలకు
అమృతమురాసి
నాలుకలకు
అందిస్తా

పదాలను
ఏరికూర్చి
పలుకులమ్మను
ప్రార్ధిస్తా

పదకౌశలమును
ప్రదర్శించుతా
పదవిన్యాసాలను
పరికింపజేస్తా

పదాలతోనాట్యము
చేయిస్తా
పదలాలిత్యము
చూపిస్తా

కామెంట్‌లు