సమః సమవిభక్త అంగం స్నిగ్ధ వర్ణః ప్రతాపవాన్
పీన వక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః !
ధర్మజ్ఞః సత్యసందః చ ప్రజానాం చహితేరతః
యశస్వీ జ్ఞానసంపన్నః శుచిః వశ్యః సమాధిమాన్శుభలక్షణః !
ధర్మజ్ఞః సత్యసందః చ ప్రజానాం చహితేరతః
యశస్వీ జ్ఞానసంపన్నః శుచిః వశ్యః సమాధిమాన్ !
ప్రజాపతీ సమః శ్రీమాన్.ధాతా రిపు నిషూధనః
రక్షతి జీవ లోకస్య ధర్మస్య పరిరక్షితా !
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షితా!
వేద వేదాజ్గ తత్వజ్ఞో ధనుర్వేదే నిష్టితః !
సర్వశాస్త్ర అర్ధ తత్వజ్ఞో స్మృతి మాన్ ప్రతిభాన వాన్
సర్వలోక ప్రియ సాధుః అదీ నాత్మా విచక్షణః !
శ్రీరాముడు అంత పొడవుగా గాని అంతే పొట్టిగా గాని గాక ప్రమాణమైన దేహము గలవాడు. సమానమైన కరచరణాది అవయవ సౌష్టవం గల
వాడు. కనువిందు గావించు దేహము గలవాడు.
పరాక్రమశాలి, పరిపుష్టమైన వక్షస్థలము గలవాడు.
విశాలమైన కన్నులు గలవాడు. పొంకమైన అవయవముల పొందిక గలవాడు. సాటిలేని శుభ
లక్షణములు కలిగినవాడు.
ఆశ్రయించిన వారిని ఆదుకొనుటయే పరదర్మముగా గలవాడు.అడిగిన మాటను తప్పనివాడు.ప్రజలకు హితమొనర్చు స్వభావము
గలవాడు.ఆ విధముగా ఖ్యాతికెక్కిన వాడు.సకల
శాస్త్రపారంగతుడు.స్వయముగా పవిత్రుడు.
ప్రాణి కోటికి పవిత్రమొనర్చువాడు.భక్త(ఆశ్రిత)
పరాధీనుడు.ఏకాగ్రచిత్తుడు.త్రిమూర్తి స్వరూపుడై
ప్రజాపతి బ్రహ్మవలె జనులను సృష్టించినవాడు.విష్ణువువలె అఖండైశ్వర్య సంపన్నుడై పోషించు వాడుసాధుపురుషులను బాధించు వారిని హతమొనర్చుటలో హరుని వంటివాడు.స్వపర భేధములేక అందరినీ
రక్షించువాడు.
ధర్మాన్నిస్వయంగా ఆచరించువాడు.లోకులచేత ఆచరింప చేసి, దానిని కాపాడు వాడు.స్వధర్మమును కాపాడు వాడు.తనని ఆశ్రయించిన వారు ఎట్టి వారైనను వారిని రక్షించు వాడు.వేదవేదాంగముల పరమార్థములను ఎరిగినవాడు.ధనుర్వేదము నందును (యుద్ధవిద్యలందున) ఆరితేరిన వాడు.సకల శాస్త్రములను సాకల్యముగ ఎరిగిన
వాడు.శాస్త్రాది విషయములందు ఏమరు పాటు
లేని వాడు.సమస్త వ్యవహారములయందు చక్కని
స్పూర్తి గలిగిన వాడు.సమస్తజనులకును ప్రీతి పాత్రుడు.సౌమ్యస్వభావుడు.ఉదార స్వభావుడు.
.సదసద్వివేక సంపన్నుడు.
ఓం శ్రీ రామం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి