పిల్లలకోసం పెద్దబాల శిక్ష
పెద్దలకునూ మంచిది రక్ష
వివిధవిషయాలిచ్చు మోక్ష
అక్షరమాల గణితంలో భిక్ష
బాలశిక్ష బలిమిఎంతో ఉమా!
ఓం నమః శివాయ నుండి
అక్షరమాల నేర్పునులెండి
బాలశిక్ష ఓ అక్షరాల బండి
నీతి పద్యాలు ఉండునండి
నిత్యజీవితం బాగండి ఉమా!
వారం, తిథులు ఉండునుగా
నెలలు వత్సరాలు పేర్లుగా
తూనిక కొలతలు భేషుగా
తెలుగుభాషా ఊపిరగుగా
తేటమాటలు రాసిగా ఉమా!
మైలుకిలోమీటర్ చెబుతుంది
రైలు బస్సుల ఊసుఉంది
కాలువ,నది,కడలవుతుంది
సకలవిషయాలు చెప్తుంది
చేతి పుస్తకం మేలుఉమా!
పదాలు కూర్పు సులభంగా
కథలు గాథలు సరళంగా
వినోదవల్లరి అక్షరముగా
రాశులు గ్రహాలు రమ్యంగా
భాషాపట్టాభిషేకము ఉమా!
పెద్దలూ చదువు రహస్యము
శుద్ధిచేయును మానసము
బాలబాలికల అవసరము
మేలుకొలుపుగా సుందరము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి