నాలుగేళ్ల పాటు కొత్తవలస ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా సేవలందించి,
ఇటీవల బదిలీ అయిన కుదమ తిరుమలరావు, తన పూర్వ పాఠశాలకు నాలుగు కుర్చీలను బహూకరించారు.
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఇటీవల బదిలీ అయిన కుదమ తిరుమలరావు తన ఔదార్యాన్ని చాటుకున్నారు.
ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా కూడా నాలుగేళ్ళపాటు సేవలు అందించిన తిరుమలరావు నిరంతర కృషితో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాల ఆవరణలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. వాటర్ ట్యాంక్ కు నీరు వెళ్ళేలా, అక్కడ నుండి టాయిలెట్ గదులకు నీరు వచ్చేలా అవసరమగు పైపులన్నీ వేయించారు. టాయిలెట్లకు సంబంధించిన రిపేర్లన్నీ చేయించారు. పాఠశాలకు నేమ్ బోర్డు, గేటుకి రంగులు, సర్వశిక్షా అభియాన్ ప్రతిజ్ఞలు, ఎండీఎం మెనూ, టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటన మున్నగు అనేక పెయింటింగ్ లను వేయించారు.
హేండ్ వాష్ పైపులను ఏర్పర్చే వర్క్ చేయించారు. వంటగదికి వైట్ వాష్, విద్యుత్ సరఫరా, వెంటిలేటర్, గ్యాస్ స్టౌ లను సమకూర్చారు.
ఆటస్థలం లోనికి నీరు రావడాన్ని గమనించీ, ఆ వాటర్ డ్రమ్ ను మరో చోటకు కొత్తగా నిర్మించి ఆటస్థలానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసారు. వాటర్ బాటిల్స్ నీ పాఠశాలకు మూడు స్టీల్ డ్రమ్ములనూ సమకూర్చారు.
రెండు బీరువాలు, ఒక సోఫా, పన్నెండు కుర్చీలను ఏర్పాటు చేసారు. ఫేన్ లు, చూపు లైట్లనూ వేయించారు. ప్రథమ చికిత్స పెట్టె, ఫిర్యాదుల పెట్టెలు, త్రాసు, తూనిక రాళ్ళు, కొలతపాత్రలను సమకూర్చారు. రెండు సార్లు పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు.
నాలుగు సంవత్సరాలూ ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైన వందమంది బాలబాలికలకు జ్ఞాపికలను బహూకరించి, వీడ్కోలు పలికారు.
బదిలీ అయిన టీచర్లకు, పూర్వ ఉపాధ్యాయులకు, విద్యా శాఖాధికారులకు, పాఠశాల సముదాయం చైర్ పర్సన్ కు, వైస్ ఎంపిపి, పేరెంట్స్ కమిటీ సభ్యులకూ, బాలబడి నిర్వాహకులకు, జిఎంఆర్ ప్రతినిధులకు, అంగన్ వాడీ కార్యకర్తలకు, క్లస్టర్ రీసోర్స్ పర్సన్ కు, రంజాన్ పండుగ రోజున ముస్లిం సోదరులకు, మదర్స్ డే రోజున ఆదర్శమాతృమూర్తులకు, హిందీ దినోత్సవం సందర్భంగా హిందీ టీచర్లకు, గణిత దినోత్సవం సందర్భంగా గణిత ఉపాధ్యాయులకు, టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులకు ఇలా పలు సందర్భాల్లో వారివారి సేనలను కొనియాడుతూ ఘనంగా సన్మానాలను నిర్వహించారు.
పాఠశాల సమయంలో గుణాత్మక విద్యను అందించేలా బోధన గావిస్తూ,అదనపు తరగతులను ప్రతీరోజూ నిర్వహించారు. క్విజ్ పోటీలు, లైబ్రరీ బుక్స్ పఠనం, గ్రంథాలయ తరగతులను విరివిగా నిర్వహించి చదువుల స్థాయిని పెంపొందించేందుకు కృషి చేసారు.
తిరుమలరావు బదిలీ అనంతరం ఆ ప్రధానోపాధ్యాయులు స్థానంలో నియమితులైన బూరి వెంకటనాయుడుకు నాలుగు కుర్చీలను బహూకరించి తిరుమలరావు తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలరావును ప్రధానోపాధ్యాయులు బూరి వెంకటనాయుడు, ఉపాధ్యాయులు బొల్లా వెంకటలక్ష్మి, బలివాడ నాగేశ్వరరావు, నల్ల తిరుమల సురేష్ కుమార్, ఆర్.గణపతి, రాచకొండ సీతామాలక్ష్మి, సింగారపు రాధ, మొయిల విజయలక్ష్మి అభినందించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి