మండేవేసవిలో కురిసే వానలా
దూరాన వెలిగే గోరంతదీపంలా
పెదవులవెనుక పలకని ప్రేమలా
రెప్పల వెనుక చెప్పని కలలా
ప్రత్యూష సమయంలో వీచే గాలిలా
పెరట్లో పూసిన తొలి గులాబీలా
మదిలో తట్టిన భావాలన్నీ
కుదురుగ బుట్టకు ఎత్తినట్టు
చిందరవందర ఊహలన్నీ
చివరకు కట్టగ కట్టినట్టు
మారాకు వేసిన చిన్ని ఆశలను
మురిపెంగ పెంచుకున్నట్టూ
నా వేపే నడిచొస్తున్ననా గమ్యాన్ని
అతిశయంగా ఆహ్వానిస్తున్నట్టూ...
పొంగే భావాలకు రంగులు నింపి
నింగిని చిత్రం గీసినట్టూ...
చుట్టు ముట్టే గాలి తెచ్చే
కబురుకోసం ఎదురుచూస్తూ
దారిపొడుగునా చూపులు పరచి
కోరుకున్న వేకువను స్వాగతిస్తూ
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి