ఆవగింజలతో కలాం చిత్రీకరించిన కళాకారుడు - వెంకట్ మొలక ప్రత్యేక ప్రతినిధి:


  వికారాబాద్  జిల్లా దౌల్తాబాద్ వారి యాంకి గ్రామానికి చెందిన సున్నపు అశోక్ ఆయా సందర్భాలను అనుసరించి ఎన్నో అబ్బురపరిచే చిత్రాలను చిత్రీకరించి పలువురి మన్ననలను పొందుతున్నాడు. పేదరికంతో తన ప్రతిభను నిరూపించుకునే అవకాశాల కోసం ఎదురు చూస్తూ.. తాను చిత్రీకరిస్తున్న బొమ్మలను పలువురికి చూపిస్తూ.. ప్రశంసలు పొందుతున్నాడు. ఇందులో భాగంగానే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని ఆయన భారతావనికి చేసిన సేవను గుర్తు చేస్తూ... ఆవ గింజలతో అపురూపమైన కలం చిత్రీకరించాడు. పేదరికాన్ని జయించి, సాంకే తిక శాస్త్ర రంగంలో భారత దేవ గొప్పదనాన్ని చాటిన వ్యక్తిని ఈ సందర్భంగా స్మరించుకొని నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.
కామెంట్‌లు