సుప్రభాత కవిత ; - బృంద
నిదురించని కన్నులు
దాచిన స్వప్నాలు
కదిలే కనురెప్పలకు
మాత్రమే తెలిసిన నిజాలు

వికసించని మొగ్గను దాగిన
అందాల పరిమళం
వీచే గాలికి మాత్రమే
తెలిసిన రహస్యం

మోడైన చోటే చిగురులు
తప్పక వస్తాయని
రాలిన ఆకుల కొమ్మకు
మాత్రమే తెలిసిన సూత్రం

ఓర్పు ఓదార్పు కాదు
తెగించే ధైర్యం  కావాలని
ఒంటరిగా నిలబడ్డ మనసుకు
మాత్రమే తెలిసిన  తెగువ

నడిచే దారి తెలియనిదైనా
నడకలో  తడబాటు చూపరాదని
నడిపే అడుగులకు
మాత్రమే తెలిసిన అణకువ

చిందేసి ముంచేసిన చీకటి నిదురించని కన్నులు
దాచిన స్వప్నాలు
కదిలే కనురెప్పలకు
మాత్రమే తెలిసిన నిజాలు

వికసించని మొగ్గను దాగిన
అందాల పరిమళం
వీచే గాలికి మాత్రమే
తెలిసిన రహస్యం

మోడైన చోటే చిగురులు
తప్పక వస్తాయని
రాలిన ఆకుల కొమ్మకు
మాత్రమే తెలిసిన సూత్రం

ఓర్పు ఓదార్పు కాదు
తెగించే ధైర్యం  కావాలని
ఒంటరిగా నిలబడ్డ మనసుకు
మాత్రమే తెలిసిన  తెగువ

నడిచే దారి తెలియనిదైనా
నడకలో  తడబాటు చూపరాదని
నడిపే అడుగులకు
మాత్రమే తెలిసిన అణకువ

చిందేసి ముంచేసిన చీకటి 
చిరకాలముండదనీ
పొడిచే తొలిపొద్దు కిరణానికి
మాత్రమే తెలిసిన సత్యం

నిన్న ఎపుడూ గతమేననీ
రేపు తీయని కలయనీ
నేడు మాత్రమే నీదనీ
తెలియచేస్తూ వచ్చే వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు