ప్రశంస - విమర్శ - సమీక్ష..!; - కోరాడ నరసింహా రావు.
 అది   యే కళాకృతియైనా..... 
 ఓ ఆత్మీయ ప్రశంసను పొంద గలిగితే.... దానికి ధన్యత చేకూరినట్టే... !
    ప్రశంసించలేకపోయినా.... 
 గుణ - దోష సహిత చిరు సమీక్షను చేసినా ఆ కళాకృతి,దానియొక్క యొక్క కర్త లకు కాస్త ప్రయోజనం చేకూరుతుంది.. !
   కనీసం... ఒకింత విమర్శనైనా 
ఆ ప్రేక్షకుడు, లేదా పఠితుడు 
 చేసినప్పుడే... అది ఉభయతారకం చెందుతుంది !
        ప్రశంసో... సమీక్షో  - విమర్సో  ... ఎదో ఓ రకంగా 
 ఆ కళాకృతిని పరామర్శించటం సంస్కారమనిపించుకుంటుంది !...
    ఐతే...., మరీ ముఖ్యంగా... 
ఇదంతా ... కవుల, రచయితల రచనలకే ఎక్కువ.. !!
       ఈ ప్రశంస, సమీక్ష, విమర్శలనేవి...కొత్తగా వచ్చినవి కావు...రచనా ఆ వ్యాసంగం తోనే ఇవీ మొదలయ్యాయి !
       గానీ ఆ రచనలకు ఆయా పరామర్శలు సహేతుకమేనా... 
అంటే.. అనుమానమే... !
    ఆయా రచయితలు వీరికి ప్రియతములు (అస్మదీయు )
లైతే ... ఆకాశానికెత్తేయటం..., 
 తస్మదీయులైతే... వెదికి -- వెదికి గోరంతలు కొండంతలు చేసి తప్పులనెత్తిచూపటం... 
ఇలా ఆ రచనకు, రచయితకూ అన్యాయం చెయ్యటమే కదూ !
పై రెండూ.... సరికాదు.. !!
     ఏదైనా... ఒక కృతిని సహృదయతతో... చూడాలి, 
 దాన్ని వ్రాసిన వ్యక్తి ఎవరు, అని చూడకుండా... ఆ రచయిత ఏమి వ్రాయాలనుకున్నారు... ఆ అనుకున్న విషయాన్ని ఎంతవరకు వ్రాసి ఆ రచనకు న్యాయం చేయగలిగాడు అనే చూడాలి !
   అదికూడా... ఆ విషయం పట్ల ఆయా సమీక్షకులకు మొట్టమొదట ఖచ్చితమైన అవగాహన, అభిరుచి ఉండి తీరాలి !
    నిష్పక్షపాతంగా పరిశీలించి 
నిజాజాయతీతోకూడిన న్యాయమైన అభిప్రాయాన్ని వెల్లడించ గలగాలి !!
   అలా కాకుండా... పక్షపాతబుద్ధితో విమర్శించినా 
అతిగా ప్రశంసించినా.... ఆ రచనకూ, రచయితలకే కాదు... 
 ఆ కళామ తల్లికే ద్రోహం చేసిన వారమౌతాము... !
   మనమిచ్చే ఓ ప్రశంస... ఓ సమీక్ష... ఓ విమర్శ.... ఆయా రచయితలలో నూతనోత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగించి మరెన్నెన్నో ఉత్తమ రచనలకు ప్రేరణ కావాలి.... !
        ******

కామెంట్‌లు