జీవితంలో నీతి నిజాయితీలు ఇత్యాది ఉన్నత విలువలకు కట్టుబడి వుండదం ఎంతో అవసరం. మనిషి మనుగడ సవ్యంగా సాగాలంటే నీతి నిజాయితీ తప్పకుండా పాటించాలి అని పెద్దలు చెబుతారు లేదంటే మనిషి అధోగతి పాలవుతాడు. ముందుగా మనకు ఈ జన్మనిచ్చిన భగవంతునికి సదా ఋణపడి వుండాలి. మనవంతు బాధ్యతగా ఆ దేవున్ని స్మరణం, కీర్తనం, భజన రూపంలో లేదా మనకు నచ్చిన ఏదో ఒక సాధన ద్వారా ప్రతిక్షణం ఆరాధించాలి. అపుడే ఈ జన్మకు ఓ అర్థం పరమార్థం ఏర్పడుతుంది.కేవలం సత్యవాక్య పరిపాలన కోసం హరిశ్చంద్రుడు రాజ్యాన్ని, భార్యాపిల్లలను సైతం త్యజించిన గొప్ప ఆధ్యాత్మిక, కర్మభూమి మన భారతదేశం.మంచి మాట జీవితాన్ని బాగు చేస్తుంది. చెడు దారుల నుంచి తప్పించి మంచి మార్గాన్ని నిర్దేశిస్తుంది. దు:ఖితులకు మంచి మాట ఓ సాంత్వన. ఓదార్పునిచ్చే ఆపన్న హస్తం. కన్నీరు తుడిచే అభయ హస్తం. పరాజయాల నుంచి విజయాలవైపు పయనించే వారికి మంచి మాట ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తుంది. మనో ధైర్యాన్ని ప్రసాదిస్తుంది.శ్రీరాముడు పరిపూర్ణ మానవ అవతారం.
మానవుడు ఎలా ప్రవర్తించాలో, ఎంత బాధ్యతగా ఉండాలో తెలిపే రూపం.
నీతి నిజాయితీలు, సత్ప్రవర్తన, ప్రజా సంక్షేమం, పితృవాక్పరిపాలన, ఋజువర్తన, కర్తవ్య పరాయణత్వం,... ఇలాంటి ఎన్నో మానవ ధర్మాలను ఎన్ని కష్టాలోచ్చినా ఆచరించాలని లోకానికి తెలియజేసిన ఆదర్శ మానవుడు. అటువంటి అవతారమూర్తి జన్మించిన ఈ పవిత్ర భారతావనిలో మనమందరం నీతి నిజాయితీలు వంటి ఉన్నత విలువలకు కట్టుబడి జీవించడం అత్యావశ్యకం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి