నిషేధం!!- ప్రతాప్ కౌటిళ్యా
భూగోళాన్ని చుట్టి వచ్చిన రక్తనాళాలు
జాబిల్లిని చుట్టిన నాడీ కణాలు
నిరంతరం మోగుతున్న నిండు నూరేళ్ల గుండెగంట మూగబోయింది.!!
రెప్పవాల్చకుండా వెలుగుతున్న
గండ దీపం కంటి చూపు!!!?


రక్తానికి రంగులద్దితే ఇంద్రధనస్సు
నదులు ద్రవించినట్లు
గొంతులో స్వరపేటిక ఆకాశవాణిలా
నీలిరంగుల్లోకి అనువదిస్తున్నది.!!?


నిప్పు కనికల్లా మాటలు రాలి పడుతుంటే
చూపులు తెగిపోతున్నవీ
కత్తులు విరిగి కొలిమిలో కరిగిపోతున్నవీ
వ్యతిరేకిస్తున్న నరాలు
వెన్నుపాముల బుస కొడుతుంది.!!


చేతి వేళ్లను కత్తిరించి అలంకరించిన అక్షయపాత్ర
ఎప్పటికీ ఆకలిగొంటూనే ఉంది.!!


ఊరేగుతున్న పాదాలు యుద్ధ ప్రాతిపదికన
యుద్ధాన్ని ప్రకటించినట్లు సమాచారం!!

ఐరావతం ఆనవాయితీగా అలంకరించబడింది.
యుద్ధభూమి ఇప్పుడు అంతఃపురం
పొలికేకలకు సమాధానమే సుదర్శన చక్రం!!


కఠినమైన గుండెల్లోనే
ఆశ్రయము అనుమతించబడింది
వీల్చాల్సిన గాలిని అనుమతించిన ఊపిరి తిత్తులు
స్వర్గధ్వారాలను తెరిచి ఉంచినవి!!

తాగాల్సిన రక్తం స్వర్గస్తురాలయింది
కన్నీరు నీరును గుండెల్లోకి తోడి
కాళ్లు చేతులు విశ్రమించాయి.!!


నిక్కబొడుచుకున్న వెంట్రుకలు
తలకాయను ధిక్కరించినట్టు తెలుస్తుంది.!!

నాలుకలన్నీ నమిలి మింగిన ఎముకల నడుములు విరగొట్టిన నరాలు
ఇప్పుడిప్పుడే గద్గద స్వరం తో మాట్లాడుతుంది.

నలుపు తలుపుల అంతఃపురాలు
మానస సరోవర కోసం కలగంటున్నాయి!!

కమలం మలిన మంటని కళ్యాణమంటపాల్లోకి మార్చబడుతుంది.!!

లోకాల్ని చుట్టిన చుట్టల్లా తమలపాకులు
ఆరు బయట తలంటుకొని
వెంట్రుకల్ని ఆరబెట్టుకుంటుంన్నవీ!!!


నాలుగు గదుల్ని మూసివేసిన హృదయం
పురాతన మందిరంలా బోసిపోయింది.!!

దేదీప్యమానంగా వెలుగుతున్న దీపం
కోపంతో
అంతఃపురాన్ని అంటి బెట్టింది.!!!?

ఇప్పుడు స్మశానం నిషేధించబడింది.!!!


ప్రతాప్ కౌటిళ్యా 🙏

కామెంట్‌లు