పసిడి వెలుగులు
కరిగిన బంగారంలా
గగనపు యవనికపై
నిశ్శబ్దంగా పరచుకుంటూ
కొండలనడుమ కాంతి
విస్ఫోటనంలా వెలుగు చిమ్ముతూ
జగతిని ఆవరించిన
తిమిరాన్ని పోద్రోలే వేళ
సిరి జల్లు కురిపించిన
కరి మబ్బుల మాటున
నింగికి నేలకు వంతెనగా
హరివిల్లు విరిసిన వేళ
మాటలుడిగి మంత్ర ముగ్ధలా
చేష్టలుడిగి చలనంలేకుండా
అబ్బురంగా చూస్తూ...
ఆనందంతో కళ్ళు పెద్దవి చేసి
ప్రకృతి మొత్తం పరవశించి
పలుకురాక మూగయై
పలకలేని భావమై
తిలకిస్తూ మురిసి పొంగిపోయేవేళ
తెలియని ఆనందపు అలలు
అలవోకగా ఆవరించి
తెలవారిన సమయాన
కల వరించ వచ్చినట్టు
కనుల ముందు ప్రభవించు
కర్మసాక్షికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి