బతుకమ్మ పద్యాలు - డి.వినాయక్ రావు M.A. MEd భైంసా , జిల్లా నిర్మల్ ఫోన్ 9440749686
1.కం:గౌరియె బతుకమ్మయ్యెన్
పౌరుష మొసగంగ తెల్గు ప్రజలను బ్రోవన్
భూరిని హృదిలో దాచుతు
గారాబము జేయ సంతు గడపను ద్రొక్కెన్

2.కం:ఎంగిలి బతుకమ్మంటున్
భంగిమ జూపంగ నాడు భక్తితొ వనితల్
పొంగుతొ చెంగని నెగురుతు
నంగముగా నాడు పాడు నమ్మాంగజలున్

3.కం:నటుకుల బతుకమ్మంటున్
నటనలు జేయంగ తిర్గు నందితలంతా
పఠనము గౌరీ గాథా
ర్భటనము కరతాలముండ భవ్యము దృశ్యం


కామెంట్‌లు