ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః!!(మూల మంత్రము)
==========================================
శ్రీ లలితా సహస్రనామం అత్యంత శక్తిమంతమైనదిగా మహా మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది. 'బ్రహ్మాండపురాణం' లో ఉత్తరభాగంలో లలితా సహస్రనామావళి విశిష్టత కనిపిస్తుంది. దీనిని మొదటిసారిగా హయగ్రీవ స్వామి ... అగస్త్య మహర్షికి బోధించాడు. ఆనాటి నుంచి కూడా లలితా సహస్రనామం తనని విశ్వసించిన వారిని ఒక రక్షణ కవచంలా కాపాడుతూ వస్తోంది. అందువల్లనే చాలామంది నిత్యం అమ్మవారి లలితా సహస్రనామావళిని చదువుతూ వుంటారు.చాలామంది లలితను చదవడం వలన ఒకే విధమైన ఫలితం ఉంటుందని అనుకుంటారు. కానీ ఇందులోని ప్రతి పంక్తి ఒక్కో దోషాన్ని నశింపజేసి ... ఒక్కో పుణ్య ఫలాన్ని అందిస్తుంది. ఆరోగ్యం .. సంపద .. సంతానం .. ఇలా ఏది కావాలనుకుంటే అది పొందడానికి కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. ఆ పద్ధతులను పాటిస్తూ లలితా సహస్రనామం చదవడం వలన ఆశించిన ప్రయోజనం పొందవచ్చు.
దేవి నవరాత్రులలో ప్రతిదినం పారాయణం చేయడం వలన మనో వాంఛ ఫలిస్తుంది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి