ఆధ్యాత్మిక పద్యాలు :-5&6- మమత ఐల-కరీంనగర్-9247593432
 తే.గీ
బంధ మోచనం గలిగించు భాగ్య దాతఁ
దీన బాంధవా యనితల్వ గానమందు
ధ్యానులేగాక వెతికేరు దీనులైన
వెతలు దీర్చెడి ధీరున్ని వేణు నెపుడు
కం. 
దాతగ సుఖ దుఃఖాలకు
జ్యోతుల నింపెడి వెలుగులజువ్వల తీరున్
తాతయు తండ్రియు సుతుడై
నీతిని బోధించ వచ్చె నిజముగ కృష్ణా!

కామెంట్‌లు