ఆధ్యాత్మిక పద్యం;- మమత ఐల- కరీంనగర్-9247593432
 తే.గీ
తండ్రి నీడలో పెరిగేడి తరుణులెల్ల
వినయ శీలులై యభివృద్ధి ఘనత గాంచఁ
దేశ మెల్లరు సౌభాగ్య పాశమల్లె
కొరత లేకుండ నుండరా!మురళి కృష్ణ
తే.గీ
వాన వరదల్లె వచ్చెడి వయసునందు 
బురదగా మారి కోరికల్ బుద్ధి మార్చు
యేక చిత్తంబు తోనున్న పాకశాలె 
శారదాంబగా మార్చదా! శరణు కృష్ణ

కామెంట్‌లు