హరివిల్లు రచనలు - కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 486
🦚🦚🦚🦚 
ప్రగతికి కావలిసిన
నిర్ణయాలు గమ్యాలు.....!
కాకూడదవి మున్ముందు
అగమ్య గోచరాలు..........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 487
🦚🦚🦚🦚
ఉదయాన అద్దం ముందు
అందాలొలుక బోయకు.....!
ఉదయించే రవి ముందుకు
వెళ్ళు ఆరోగ్యం కొరకు.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 488
🦚🦚🦚🦚
ఉజ్వల భవిష్యత్తునకు
ఉండవలదు కపట ప్రేమ....!
పరస్పర మనస్పర్దలు
వీడిన నిలుచును ప్రేమ......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 489
🦚🦚🦚🦚
సహనముగ మెలిగి కోరు
వరాలు శుభ ఫలితాలు......!
అసహనముగ రగిలి కోరు
వరాలు అశుభ ఫలితాలు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 490
🦚🦚🦚🦚
కూటికి చింతలు దీరిన
ముఖములో ఆనందాలు...!
శ్రమ ఒరిపిడుల నడుమ
రాటుదేలిన బ్రతుకులు.......!!
               ( ఇంకా ఉన్నాయి )

కామెంట్‌లు