హరివిల్లు రచనలు -కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు  496
🦚🦚🦚🦚
సీసెడు బియ్యం గింజల
ఆశ చూపి వలేశారు.......!
బంధీ చేసి బయటకు
పంపక బంధించారు.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 497
🦚🦚🦚🦚
కష్టపడి పని చేసిన
తెలియును కష్టంవిలువ.....!
సంపద విలువకు జతై
తెలియు సమయవిలువ....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 498
🦚🦚🦚🦚
 
వత్తి నూనెలో తడిసి
కాలి వెలుతురు నిచ్చును....!
సహనమున దేదీప్యమై
వెలుగులనే పంచును.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 499
🦚🦚🦚🦚
ఆశల వలలో పడి 
ప్రలోభాలకు లొంగకు....!
నీ ఓటును వేయాలి 
నీతియుత వ్యక్తులకు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 500
🦚🦚🦚🦚
*కార్తీక శుద్ధ ద్వాదశి* 
ఉసిరి తులసి ల పూజ
*క్షీరాబ్ది ద్వాదశి*..........!
సకల శుభాన్నిచ్చునట్టి
*హరిబోధినీ ద్వాదశి*.....!!
          ( ఇంకా ఉన్నాయి )

కామెంట్‌లు