హరివిల్లు రచనలు -కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 501
🦚🦚🦚🦚 
సువిద్యార్జనకు సమాప్తి
అనునది ఉండకూడదు....!
పుణ్య సముపార్జనలకై
వెనుకడుగు వేయకూడదు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 502
🦚🦚🦚🦚
కష్టాలకు వెరవని
ఉత్తమ పురుషుడు....!
గుండెల్లో గోదారి
చేరినను తొణకడు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 503
🦚🦚🦚🦚
ఆస్తులు సంపాదించి
ఇవ్వలేదని తిట్టకు......!
అస్తులరిగేలా నిన్ను
కని పెంచారని మరువకు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 504
🦚🦚🦚🦚
బురదలో మనం వేసిన 
రాయి! లోనికి చేరింది.....!
బురదను మనపై చిమ్మి
తన పగను తీర్చుకుంది.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 505
🦚🦚🦚🦚
మన సంస్కృతి కాపాడు
శాస్త్రాలు చదువుదాం......!
దేశ రక్షణకు సరిపడు
అస్త్రాలను వాడుదాం.......!!
               ( ఇంకా ఉన్నాయి )


కామెంట్‌లు