హరివిల్లు రచనలు - కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 511
🦚🦚🦚🦚 
అన్ని సమస్యలకు తగిన
పరిష్కారాలుంటాయి.......!
కాలయాపనలో బహు
క్లిష్టమై కూర్చుంటాయి.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 512
🦚🦚🦚🦚
పరిమితులు లేని
అనుమతులు రావు....!
గ్రహగతులు చూపని
జాతక చక్రాలుండవు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 513
🦚🦚🦚🦚
శాస్త్ర విదిత కర్మలు
నియమబద్ద వ్రతములు....!
గరిష్ట నిష్ఠాచరణలు
పుణ్య ప్రాప్తి హేతువులు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 514
🦚🦚🦚🦚
సూర్యోదయాన కనాలి
స్వర్ణ అలల సోయగాలు....!
సూర్యాస్తమయ సమయాన
కనకాంబర దర్శనాలు........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 515
🦚🦚🦚🦚
వాలు కనుల అరచూపులు
వలపుల తలుపుల కులుకులు.!
అరనవ్వుల చిరునవ్వులు
స్వర్ణ చెక్కిళ్ళ తళుకులు.........!!
               ( ఇంకా ఉన్నాయి )

కామెంట్‌లు