హరివిల్లు రచనలు -కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 521
🦚🦚🦚🦚 
కలికాల గమనంలో
కరిగే కొవ్వొత్తులం......!
వెలుగులను పంచుటలో
నిరంతర సమవర్తులం..!!
🦚🦚🦚🦚
హరివిల్లు 522
🦚🦚🦚🦚
పెరట్లో కరివేపాకు 
రెమ్మలు పట్రావమ్మా....!
అందిన రెండు వేపాకు
కొమ్మలు తెచ్చానమ్మా....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 523
🦚🦚🦚🦚
నయాపైస ఖర్చుకాని
నవ్వులు నవ్వవెందుకు....!
వేల నోట్లు ఖర్చయ్యే
రోగాలు ఆపవెందుకు........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 524
🦚🦚🦚🦚
అను నిత్యం ఆవేదన
కొనసాగే అన్వేషణ......!
ఫలించాలి ఆలోచన 
సాధించు సత్య శోధన....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 525
🦚🦚🦚🦚
మన గణిత మేధావి తన
ఘణత చాటి చూపెను.....!
దేశ కీర్తి పతాకము
ఆకాశము తాకెను...........!!
               ( ఇంకా ఉన్నాయి )

కామెంట్‌లు