తిమిరంతో సమరం!;- డా.పి వి ఎల్ సుబ్బారావు. 94410 58797.
దీపావళి శుభాకాంక్షలతో..
==================
తిమిరంతో సమరం ,
వెలుగుల విజయం అమరం! 

నరకుడు లేని ఉదయం
  వెలుగుల అభ్యుదయం! 

సత్యభామ, విజయం,   
   రంగమేదైనా భామల ,
             విజయం తథ్యం !

మనం కాల్చే  బాణసంచా, విజయాల కంచిపట్టుకండువా! 

పృధ్వి  పై నరనారీలు ,     
   వెలిగించే, ఒక్కో దీపం,
         శతకోటి సూర్యతేజం! 

అంధకారం, అజ్ఞానం తప్పక,  
      రాసుకోవాలి వీలునామా! 

విజ్ఞానం,వెలుగులకే ఈ విశ్వం, 
       ఇక మారని చిరునామా! 

చంద్రుడిపై జెండా ఎగరేసాడు,
నేడిక్కడికి చంద్రుడ్నే తెచ్చాడు! 

అమావాస్య నాడు,   
   చంద్రోదయం ,ప్రతిరోజు,  
       సకలజన శుభోదయం!
_________

కామెంట్‌లు