ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 భానుమతి గారు ఈ పాత్ర వేయడానికి మీరు నాకు ఏమీ డబ్బు ఇవ్వనవసరం లేదు  సినిమా మొత్తం పూర్తయిన తర్వాత  నా నటన మీకు నచ్చినట్లయితే  మీకు ఎంత తోస్తే అంత ఇవ్వండి  డాక్టర్ గారు  మీరు మీ చేత్తో రూపాయి ఇచ్చిన నాకు ఆనందమే  నాకు కావాల్సింది డబ్బు కాదు  పాత్ర  ఈ మధ్యకాలంలో నిలబడే పాత్ర నాగమ్మ దేవి  అన్న తర్వాత  ఎంతో ఆనందంగా తిరిగి వస్తే  చక్కటి పార్టీ  ఇచ్చారు వీరయ్య గారు  ఆయన మందు పార్టీ  నేను నాన్నగారు దానికి వ్యతిరేకం  మీ పని మీరు చేసుకోండి  మాకు ఏమైనా కూల్ డ్రింక్స్ తెచ్చి పెట్టండి చాలు  అని ఆరోజు రాత్రి  మొత్తం  ఆ సినీ సంఘటనలను గురించి  మాట్లాడుకున్నాం  అలా పలనాటి యుద్ధం చిత్రంలో  గొప్ప నటి భానుమతి గారు  నాగమ్మ గారి వేషాన్ని నిలబెట్టారు  మాకు మిగిలింది ఆ ఆనందమే. పల్నాటి యుద్ధం చిత్రం సంగీత పరంగా  చాలా బాగుండాలి అన్న అభిప్రాయంతో ఎస్ రాజేశ్వరరావు గారిని సంగీత దర్శకుడుగా ఏర్పాటు చేశాం  ఘంటసాల వారు  పాటలు  మా సినిమా జరుగుతున్న రోజుల్లోనే ఘంటసాల వారికి పద్మశ్రీ బిరుదు ప్రభుత్వం వారు ఇచ్చారు  రాజేశ్వర రావు గారికి అది కడుపు మంట  తనను గుర్తించలేదన్న ఆవేదన  మన సినిమాలో బాలచంద్రుడికి ఒక పద్యం  ఉంది దాన్ని  ఘంటసాల వారు పాడుతున్నారు  తన కసి తీర్చుకోవడానికి రాజేశ్వరరావు గారు  మూడు పాదాలు  సులభంగా ఉండేట్టు  చివరి పాదం ఘంటసాల వారికి పలకని  రాగంతో  స్వరపరిచారు
సాధన చేసేటప్పుడే వారికి అనుమానం వచ్చింది  17 సార్లు  రికార్డింగ్ అయినా  చివరి పాదం దగ్గరకు వచ్చేటప్పటికి ఆగిపోతుంది.
సాయంత్రమైంది  ఇంటికి వెళ్లి టీ తాగి వస్తాను అని  ఘంటసాల వారు బయలుదేరితే వీరయ్య గారు  ఇంటికెందుకండి ఇక్కడ సిద్ధంగానే ఉంది తాగమంటే  అలా కాదు అని వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన కాసేపటికి రాజేశ్వరరావు గారు  పద్మశ్రీ గారు ఇంటికి వెళ్లారు తిరిగి రారు  ఈ పద్యం పాడ డానికి మీరు ఎవరినైనా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పారు  మీ దృష్టిలో ఎవరున్నారు చెప్పమంటే  బాలమురళీకృష్ణ గారు తప్ప ఇంకెవరు పాడలేరు  అని చెప్పాడు రాజేశ్వరరావు గారు  వారైతే మా అబ్బాయి తీసుకొస్తాడు సమస్య లేదు  అని నాన్నగారు డాక్టర్  కే వెంకట్ రాజు గారు  అనేసరికి రాజేశ్వర రావు గారు ఆయనను ఒప్పించడం అంత తేలికైన విషయం కాదు తర్వాత మీ ఇష్టం అన్నారు.






కామెంట్‌లు