ఒక పర్యాయం ఆది విష్ణు రచించిన సిద్ధార్థ నాటకం చదివి బోస్ ఇది రంగస్థలం మీద ప్రదర్శిస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఎన్ వి ఎస్ వర్మ నేను టి రామచంద్ర రాజు గుంటూరు లక్ష్మి గన్నవరం నుంచి బోసు శిష్యులు కూడా వచ్చి నటించారు కబీర్ దాస్ దర్శకత్వం వహించారు మధ్య మధ్యలో నాన్నగారు వచ్చి చాలా కదలికలను మార్చి నాటకానికి నిండుతనం తీసుకొచ్చారు ఆ సిద్ధార్థ నాటకంలో బోస్ ధరించిన జమీందారు వేషం బాగా పండింది తుది ప్రదర్శన చూసిన తర్వాత నాన్నగారు బోసు గారు చాలా బాగా పెరిగారు అని ప్రశంసించారు ఎన్ని నాటకాలు ఆడినా బోసు గిడుతూరి సూర్యం గారు రచించిన మానవుడు చిరంజీవి మూకాభినయంలో నన్ను తీర్చిదిద్దిన పద్ధతి చాలా బాగా నచ్చింది. కొడాలి గోపాల రావు గారు చైర్మన్ నాటకం ప్రారంభించినప్పటి నుంచి నేను డాక్టర్ రాజు గారిని నాన్నగారని పిలుస్తూ ఉండేవాడిని నాకు అనేక అనుమానాలు వస్తూ ఉన్నప్పుడు వాటిని తీర్చడానికి అనేక ఉదాహరణలు చెప్పి నివృత్తి మార్గాన్ని చెప్పేవారు ఉషశ్రీ గారు చెప్పే భారత రామాయణాలను విన్న తర్వాత ఎన్నో సందేహాలు వచ్చేవి దానితో ఒకరోజు ఉషశ్రీ గారిని కూడా నాన్నగారి దగ్గరికి తీసుకువెళ్లి వాటిని నివృత్తి చేసుకొని వచ్చేవాళ్ళం ధర్మానికి న్యాయానికి ధర్మానికి ధర్మ సూక్ష్మానికి వేదాలను వివరించి మాకు అర్థమయ్యే పద్ధతిలో విశ్లేషించి ఉదాహరణలతో సహా చెప్పిన తర్వాత ఉషశ్రీ గారు నేను కథగానే చెబుతున్నాను తప్ప ఇంత లోతుగా ఆలోచించలేదు అన్నారు. ఆవంత్స సోమ సుందర్ గారు పిఠాపురం లో ఉండేవారు మొదటనుంచి కవితా వ్యాసంగంలో మంచి పేరు ప్రఖ్యాతిని తెచ్చుకోవాలన్న కుతూహలంతో పెద్దవారి కవితలను చదువుతూ ఉండేవారు వారికి నచ్చిన కవి విశ్వనాథ సత్యనారాయణ గారు వారి పద్ధతిలో కనీసం ఒక పద్యం అయినా వ్రాయాలి అనేది ఆయన జీవితాశయం ఆ తరువాత ఉషశ్రీ అనబడే పురాణ పండ సూర్యప్రకాశదీక్షితులు గారితో పరిచయం ఏర్పడి ఉషశ్రీ గారు ఆకాశవాణికి రాకపూర్వమే ఆంధ్రదేశంలో ఒక కవిని గురించి సావనీర్ ప్రచురించడం అనేది మొదటి ప్రయత్నం విశ్వనాథ వారితో పరిచయమున్న వారందరినీ కలిసి వారి గురించి వ్యాసాలు రాయమని ఒక్కొక్కరితో ఒక్కొక్క అంశాన్ని గురించి వ్రాయించారు.
ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి