ఏక సంతాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 నేను ఉదయం లేవగానే  కాల కృత్యాలు తీర్చుకొని నడుచుకుంటూ కృష్ణ నదికి వచ్చి  సూర్యునికి అర్ఘ్యం  ఇచ్చి వెళుతుంటాను  ఈరోజు ఎందుకు  ఉదరములో కొంచెం బాధ అనిపించి  మీ దగ్గరకు వచ్చాను అన్నారు  నాన్నగారు వారి చేతి తీసుకొని నాడి చూసి  దీనికి ప్రత్యేకంగా చేయవలసిన  వైద్యం ఏమీ లేదు  ఈరోజు రేపు  ఉప్పు కారం లేకుండా  మజ్జిగ  అన్నంతో  ఆహారం తీసుకోండి  అని చెప్పేసరికి  అలాగే నాన్న అంటూ  చరక సంహితలో  ఇలాంటి సందర్భంలో ఇలాగే చేయాలి  అన్న శ్లోకాన్ని చదివి వినిపించి  నాన్నగారిని అభినందిస్తే  అయ్యగారు  మీ రుగ్మత మీకు  తెలుసు దానికి వైద్యము తెలుసు  చరకాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన వ్యక్తులు మీరు  మరి నా దగ్గరకు వచ్చి  నన్ను పరీక్షించడానికా అన్నట్లు  అనిపిస్తుంది నాకు  అనగానే
నేను చరకుని సంహితాన్ని  చదవడం నిజం  విషయ పరిపక్వత తెలిసిన వాడిని  అన్నది కూడా వాస్తవమే  అంత మాత్రం చేత నేనే నాకు వైద్యం చేసుకోకూడదు ఇది ధర్మం  అని బొడ్డులో నుంచి ఐదు రూపాయల బిళ్ళ తీసి  నాన్నగారి టేబుల్ పైన పెట్టేసరికి నాన్నగారు  నేను మీకు వైద్యం ఏమీ చేయలేదు  మీ దగ్గర  రుసుము తీసుకోలేను అంటే  చూడు నాయనా  నీవీ వృత్తి ఎందుకు చేసుకున్నావు  ఇది ప్రవృత్తి కాదు ఇది నీ వృత్తి  కుటుంబ పోషణ కోసం  ఏదో ఒకటి చేయాలి  నీకు తెలిసిన విద్య ఆయుర్వేదం  అది చేస్తున్నందుకు రుసుము వసూలు చేయకపోతే నీ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటావు  నీ రుసుముగా నేను ఇవ్వడం లేదు  ధర్మం ప్రకారం ఇస్తున్నాను  దానిని కాదనకూడదు  స్వీకరించు అని చెప్పి వెళ్లిపోయారు.
సాంబశివ శాస్త్రి గారు వెళ్లిన మరుక్షణం  నాన్నగారి కంటి చారకు  విరామం లేదు  పదే పదే వారి నామ స్మరణ తప్ప మరి ఏమి మాకు వినిపించడం లేదు  ఆ తెల్లవారి వారి వద్దకు వెళ్లి  వారి శిష్య బృందంలో ఒకరిగా చేరి  వేద పరిచయం ఉపనిషత్తులు పంచ కావ్యాలు  కంఠస్థం చేసిన  వారి వద్ద అనేక విషయాలను  భౌతిక శారీరక ఆధ్యాత్మిక విషయాలను  ఎన్నో రహస్యాలను  తెలుసుకొని  వారిని   మెప్పించి  వారి ద్వారా మంత్రోపదేశాన్ని కూడా పొందిన చరిదార్థులు  నాన్నగారు  ఈ రంగంలో ఉన్నాను ఆ రంగంలో ఉన్నాను అని కాకుండా అన్ని రంగాలలోనూ ఉన్న  వ్యక్తి అన్నిటిలోను తానే బ్రతిమంగా నిలిచిన వ్యక్తి  జీవితంలో ప్రథముడుగానే ఉన్నాడు తప్ప ద్వితీయం పనికిరాదు అన్న పట్టుదలతో జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి  నాకు మరొకడు కనిపించలేదు.

కామెంట్‌లు