వారి వల్ల సోమ సుందర్ గారు జాగ్రత్తగా ఉంటారు అని ఉషశ్రీ గారి అభిప్రాయం. ఆకాశవాణి కార్యక్రమాలలో పాల్గొనడానికి మందు ఏర్పాటు చేయాలి డబ్బులు ఇవ్వాలి ఆడపిల్లలను అందించాలి లాంటి నీచమైన అభిప్రాయాలు ఉన్నాయి చాలామందికి కార్యక్రమాలు రాకపోయే సరికి ఇలాంటి అపవాదులు వచ్చాయి సోమ సుందర్ కు కూడా ఆ అభిప్రాయమే ఉండి ఒకరోజు పిఠాపురం నుంచి వచ్చి ఉషశ్రీ గారికి ఫోన్ చేస్తే నేను గురువుగారు కలిసి అక్కడికి వెళ్లేసరికి అతని గదిలో ఫుల్ బాటిల్ రెడీగా ఉంది అది తీసి సోమ సుందర్ టేబుల్ మీద పెట్టగానే దాన్ని విసిరి కొట్టి పగలగొట్టారు ఉషశ్రీ గారు ఏరా నేను మందుకు దాసుడ్ని అనుకున్నావా అది లేకుంటే కార్యక్రమాలకు పిలవననా నీ సత్తా చూసి పిలుస్తున్నాను తప్ప నీ మందులు చూసి కాదు కాదరా అనే తానే మందు తెప్పించి ఏర్పాటు చేశారు. సోమ సుందర్ చంటి పిల్లవాడి తత్వం అతి చిన్న విషయాలకు కూడా అలగడం మాట్లాడకపోవడం చేస్తూ ఉంటాడు ఒకసారి మీ బ్రాహ్మలు చెప్పిన (ఆయన కూడా బ్రాహ్మలే) సనాతన ధర్మమంతా తప్పులతడక అందుకే నేను కావాలని ఆభ్యుదయ కవిత్వంలో సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ ఉంటాను అని చెప్పినప్పుడు నాన్నగారు డాక్టర్ కె వెంకట్ రాజు గారు నా ప్రక్కనే ఉన్నారు అసలు సనాతనము అంటే ఏమిటి మీ అభిప్రాయం శాశ్వతమైనది అని అర్థం ధర్మం చర సత్యం వద అని చెప్పడంలో మీకు చేదస్తం ఏం కనిపించింది ఏ కాలంలోనైనా ఏ దేశం లోనైనా అది శిరసా వహించి తీరవలిసినదే కదా ప్రతి ఒక్కరు మీకాభిప్రాయం కలగడానికి కారణమేమిటి అని గట్టిగా అడిగేసరికి
అతనికి సమాధానం దొరకలేదు నా పార్టీ పెద్దలు నాకు చెప్పిన విషయం మీకు చెప్పాను అని తప్పించుకున్నారు నాన్నగారు కలగజేసుకొని నేను కూడా నీ కన్నా ఎక్కువ అంకితభావంతో పార్టీలో పని చేసిన వాడిని అంత మాత్రం చేత సనాతనాన్ని వదలవలసిన అవసరం ఏముంది నిజం చెప్పండి అని అంటే తప్ప దానిలో కూడా మాన ప్రాణ భయములందు బొంకవచ్చు అని కూడా మన పెద్దలే చెప్పారు కదా ఆ వెంటనే సమన్వయం చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తే వాటికి ఎలాంటి ఆపదలు కానీ భయాలు కానీ ఉండవు కదా ఆ విషయాలను గురించి ప్రత్యేకించి పని కట్టుకొని విమర్శించవలసిన అవసరం ఏముంది మీరు ఏ సిద్ధాంతాన్ని నమ్మారో దానిని ప్రచారం చేయండి దాని వల్ల ఎవరికి ఇబ్బంది లేదు ఎదుటివారిని దూషించకూడదని అందరికీ తెలుసు మరి మీకు ఎందుకు అర్థం కాలేదో నాకు అర్థం కావడం లేదు అని నాన్నగారు అనేసరికి అతని మొహానా నెత్తురు చుక్క లేదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి