ఏది సనాతనం'- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 శ్రీకృష్ణ పరమాత్మ తన శిష్యుడు అర్జునునకు  కురుక్షేత్ర మహా సంగ్రామంలో ఇరు సైన్యముల మధ్య  గీతా బోధ చేశాడు అన్న విషయం  వ్యాసుల వారు రాసింది  అతని ప్రశ్న ఇతని సమాధానం కలిసి మూడు శ్లోకాలలో  పూర్తి అవుతుంది  ప్రస్తుతం మనం చదువుతున్న  భగవద్గీతలో 701 శ్లోకాలు రాసి 700 శ్లోకాలు మాత్రమే మనకు అందించారు.  భగవత్పాదులు శంకరాచార్య  వ్యాసభారతంలో వారు చతుష్టుపు చందస్సును వాడారు  గీతలో 700 శ్లోకాలలో ఎక్కడైనా  ఆ ఛందస్సు గానీ వ్యాసులవారి  శైలి గాని ఎవరికైనా కనిపించిందా  ఇన్ని శ్లోకాలు చదవడానికి యుద్ధ రంగంలో సమయం  ఎలా  ఇరు సైన్యాలు ఈ శ్లోకాలు అన్ని అయ్యేంతవరకు  ఎదురు చూస్తూ ఉంటాయా  మనకు సమాధానాలు రావు.
అసలు గీత ఎందుకు రాయబడింది  మనసును అధీనంలో ఉంచుకుంటే  ఒక వ్యక్తి చేయలేని పని ఏది ఉండదు  నీ పని నీవు చేయడం తప్ప మిగిలిన వాటి జోలికి వెళ్ళవద్దు  నీవు ఏ పని చేయడానికి  ప్రకృతి నియమించినదో దానిని మాత్రమే చేయి  ధర్మక్షేత్రంతో ప్రారంభమై  సర్వ ధర్మాన్  తో అంతమవుతుంది గీత  అంటే శంకరుల వారు చెప్పదలుచుకునే విషయం ధర్మాన్ని గురించి మాత్రమే అని మనకు అర్థమవుతుంది  ఈ ధర్మం ఆచరించాలి అంటే ఏ ఒక్క వ్యక్తి వల్ల కాదు  అది సమాజపరంగా జరగవలసిన పని  కనుక నన్ను ఆశ్రయించు  అన్న ఫల శృతి తో  పూర్తవుతుంది గీత  మన శరీరంలో ఈ గీత ఎక్కడ ఉంటుంది  వెన్నుపూసలో ఉంటుంది  దీనినే  వేదాంతులు మనసు అని చెబుతారు  ఏదైనా భయపడినప్పుడు  వెన్నుపూసను స్పర్శిస్తూ  ధైర్యాన్ని పుంజుకుంటాడు మనిషి. గీత ప్రారంభంలో ఎవరు ఎవరిని ప్రశ్నిస్తారు చూపు లేని వ్యక్తి  చూపు గల  వేదాంతిని అడుగుతున్నాడు  ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రమును ధృతి చెందినవాడు తన రాజ్యాన్ని కాదు తమ్మునిది దానిని  తన భుజస్కంధాలపై ఎత్తుకొని  రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అంధుడు అనగానే అజ్ఞాని  అని మనకు అర్థమవుతుంది  అలాంటి వారి పరిపాలన ఎలా ఉంటుంది  తన స్వార్థం తప్ప ప్రజల విషయాలు పట్టవు  నియంత లక్షణం అంటారు దానిని  తాను  తన రాజ్యం మొత్తాన్ని  ధర్మ రాజ్యంగా చేయాలని అనుకుంటే  ఘోరమైన  కురుక్షేత్ర రాజ్యంగా మారింది దానికి కారణం ఏంటో నాకు అర్థం కావడం లేదు  సంజయా అన్నీ తెలిసిన వాడివి  నాకు ఈ చిక్కుముడిని  తీసి పెట్టు అని అడిగాడు.
కామెంట్‌లు