ఏకసంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.
 ఆ తర్వాత నాతో స్నేహం పెరిగి నాతో నాటకాలు వేసిన తరువాత ఒకరోజు  వారి నాటకాల గురించి అనుపవాలను  యువతరానికి కూడా పాఠ్యాంశాలుగా ఉంటాయి అన్నఅభిప్రాయంతో  వారిని అడిగి విశాఖపట్నం  ఆకాశవాణి కేంద్రంలోని దానిని రికార్డు చేశాను  లండన్ లో  నాటకోత్సవాల సందర్భంగా  భారతదేశ నాటకాల ఔన్నత్యాన్ని చెప్తూ శ్రీరాములు గారు  ఏ సంవత్సరంలో ఏ నాటకం ప్రదర్శించారు  అన్న విషయాన్ని  తెలియజేస్తూ మిగిలిన దేశాలలో నాటకాలు ఎప్పుడు  ప్రారంభమయ్యాయి  వారి మొదటి నాటకాలు ఏమిటో మొత్తం  తను ఉపన్యాసంలో చెప్పినప్పుడు  అక్కడి మేధావి వర్గం భారత దేశ ఔన్నత్యాన్ని  ప్రత్యేకించి నాటక శాఖను గురించి ఎంతో అభినందించారు.
నాన్నగారి మేనల్లుడు రామచంద్ర రాజు నాకు  గన్నవరం ఎమ్మెల్యే రత్నబోస్  కు మాకు ఏ పని కావచ్చు వచ్చిన ఆ పని చేసి పెడతాడు  నాన్నగారు ఏర్పాటు చేసే విహారయాత్రలన్నింటికీ తానే సంధాన కర్త  నాన్నగారు రాసిన అన్నమాచార్య జీవిత చరిత్ర నాటకంగా టీవీలో ప్రసారం చేయాలన్న  అభిప్రాయం వచ్చినప్పుడు  తానే దానిలో ఎవరు ఏ పాత్ర దారో  నిర్ణయించి  నాన్నగారు రాసిన ప్రతిని  తిరుపతి తీసుకొని వెళ్లి వెంకటేశ్వర స్వామి వారి పాదాలపై ఆ ప్రతిని ఉంచి  ఆ తర్వాత కమలాకర కామ్రేక్షరావు గారిని దర్శకునిగా ఒప్పించడానికి కేవీ మహాదేవను గారిని సంగీత దర్శకుడుగా  చేయడానికి  నాన్నగారి వెళ్ళినప్పుడు వారిని అంటిపెట్టుకొని ఉన్నది మా రామచంద్ర రాజే చిన్నతనంలోనే మమ్మల్ని విడిపోయిన  తన చిత్రాలను నాన్నగారు తీసిన ఫోటోలు ద్వారా జ్ఞాపకం చేసుకుంటాం.
సినీ రంగ దిగ్గజం  ఎవరు అంటే  ఎవరైనా చెప్పే మాట  రామానాయుడు గారు అని  ఆయన  మద్రాస్ వెళ్లి సినీ రంగాన్ని పరిశీలించి  తిరిగి స్వగ్రామం కారంచేడు వచ్చి  మరొక షావుకారు  తన స్నేహితుడు వీరయ్యను  తీసుకొని మద్రాసు వెళ్లి  తక్కువ ఖర్చులో సినిమా తీయడం  ఆ సినిమా బాగా ఆడిన  ఇద్దరికీ ఏవో మాటల్లో భేదం రావడంతో విడిపోయాడు  తరువాత వీరయ్య గారు  విజయవాడ విద్యాధరపురంలో డాక్టర్ కే వెంకటరాజు గారిని కలిసి  అతి సన్నిహితంగా మెలిగేవారు వారు వచ్చిన ప్రతిసారి నన్ను కూడా పిలిచేవాడు నాన్నగారు  మాటల సందర్భంగా తిరిగి సినిమా  తీయాలన్న సంకల్పం కలిగి  నాన్నగారు చెప్పిన పలనాటి చరిత్ర నచ్చి  మద్రాసు వెళ్లి  సదాశివ బ్రహ్మేంద్ర గారితో  సంభాషణలు వ్రాయించారు.

కామెంట్‌లు