సాంబశివుని ధ్యానవిథి - "కవి మిత్ర" శంకర ప్రియ., శీల.,-సంచార వాణి:-99127 67098
 🙏సాంబశివు నెల్లప్పుడు
     హృదయ పద్మము నందు
    ధ్యానింపవలె మనము
    భక్తితో! సుమతులార!
            ( అష్టాక్షరీ గీతి, శంకర ప్రియ.,)
 ⚜️పరమ శివుడు.. పార్వతీ సమేతుడు! వేద వేద్యుడు! స్వయం ప్రకాశుడు! హృదయ పద్మమునందు అంతర్యామిగా విరాజిల్లు చున్నాడు! ఈ చరాచర ప్రపంచమంతటా వ్యాపించి యున్నాడు! 
      జగద్గురు ఆది శంకరులు.. ఆ పరమేశ్వరుని యొక్క సగుణ సాకార స్వరూపమును.. భక్తి ప్రపత్తులతో ధ్యానము చేయువిధిని పేర్కొను చున్నారు   
 🔱ఋగ్యజు స్సామము లనెడుమూడు, వేదములచే తెలియదగిన వాడు, హృదయమునకు ప్రీతిపాత్రుడు, త్రిపురాసురుని సంహరించిన వాడు, అన్నిటికిని ఆదియైన వాడు, సూర్య చంద్రాగ్నులను.. మూడు కన్నులు కలవాడు, జటాజూటమును దాల్చినవాడు; కదలుచున్న పాములు హారములుగా గలవాడు, లేడిని ధరించువాడు, గొప్పవేలుపు (అపరిచ్చిన్న స్వప్రకాశ రూపుడు) ఆనంద మయుడు, నాయందు దయతో కూడిన మనస్సుకలవాడు; బ్రహ్మాది దేవతలకు, మరియు జీవులకు పరిపాలకుడు; స్వ స్వరూప జ్ఞానమునకు ఆధారమైన వాడు; జగన్మాతయగు అంబికా దేవిని, సగముమేన గలవాడు, లోకానుకరణము కలవాడు (లయకారుడు) అయిన... పరమశివుని హృదయము నందు సేవించు చున్నాను!
🙏త్రయీ వేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం 
    జటాభారోదారం చలదురగహారం మృగధరమ్
     మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం 
     చిదానందం సాంబం శివ మతివిడంబం హృదిభజే!!
         (శ్రీ శివానంద లహరి.. 3.వ.శ్లోకము.,)
           
             🚩సీస పద్యము
     ప్రాబల్కుల నెఱుంగ బడువాని, తొలివాని
      తనివిదీరగ జూడ దగినవాని ఉన్
       పెంజడల్ దాల్చి, యొప్పిదము సూపెడువాని
      చిలువపేరుల బూని చెలగువాని
      మూడు కన్నులవాని, లేడి దాల్చినవాని,
 త్రిపురంబుల హరించు తేజువాని,
      ఆనందమయమైన యాకృతి గలవాని,
కరుణామతిన్ నన్ను కాచువాని
        (🙏 తేట గీతి పద్యం )
      అఖిల భూతంబులకు పతియైన వాని
వేల్పులకునెల్ల వేల్పుగా నెలయువాని
    తనదు సామేన నంబతో దనరువాని
అతివిడంబు, చిదాలంబు నాత్మదలతు!!
    [ రచన:- శ్రీబలిజేపల్లి లక్ష్మీకాంత కవి ]
     🕉️ నమః శివాయై నమః శివాయ!

కామెంట్‌లు