పవిత్రమైన పసి పిల్లలు- -గద్వాల సోమన్న,9966414580
చిగురులాంటి చిన్నారులు
పరువు నిలుపు మగధీరులు
విరుల వంటి మనసులతో
మరువలేని మహనీయులు

కిలకిలమను చిరు నగవులు
మిలమిలమను తారమ్మలు
కళకళలాడు బాలలే
గలగలమను సెలయేరులు

నెలవంకల సోయగాలు
తలవంచని రారాజులు
అలలలా ఎగురు పిల్లలు
అలరించే అమాయకులు

నీతినిజాయితీలతో
ఖ్యాతి తెచ్చు పసి పిల్లలు
జ్యోతిల్లా ప్రకాశించు
ప్రీతి పంచే పవిత్రులు

;

కామెంట్‌లు