అక్షరాల శరాలు;- -గద్వాల సోమన్న,9966414580
ఆకాశమే హద్దుగా
భూలోకమే సాక్షిగా
సద్వినియోగమవ్వాలి
అవకాశమే గొప్పగా

ఆనందమే మెండుగా
ఆత్మబలమే అండగా
ఇక ముందుడగు వేయాలి
దైవ కృపయే తోడుగా

అడుగడుగునా హాయిగా
జీవితమంత తృప్తిగా
మున్ముందుకు సాగాలి
ప్రపంచమంత చక్కగా

ఆశయమే ఊపిరిగా
ఆలోచనలు సవ్యంగా
సత్ఫలితాల  బాటలో
బ్రతకాలి! సగర్వంగా

కామెంట్‌లు