సాగర తీరం...;- -గద్వాల సోమన్న,9966414580
సాగర తీరంలో
సంధ్యా సమయంలో
ఆహ్లాదము మనసుకు
ఆరోగ్యము తనువుకు

చక్కని కెరటాల్లో
చల్లని గాలుల్లో
దొరుకుతుంది మనిషికి
చిక్కని సంతోషం

సముద్రపు ఒడ్డులో
అందాల దృశ్యాలు
సాగర గర్భంలో
మితిలేని సంపదలు

మానవ జీవితమే
చూడగ సముద్రమే
ఎన్నో ఆటుపోట్లు 
బ్రతుకులో పలు పాట్లు


కామెంట్‌లు