చింత చితిమంట;- -గద్వాల సోమన్న,9966414580
వదిలిపెట్టు చింతలు
అవే కదా నిప్పులు
మనశ్శాంతి హరించి
తగలబెట్టు బ్రతుకులు

ఆరోగ్యం పాడగును
అశాంతి అలముకొనును
చింత ఎక్కువైతే
నష్టము వాటిల్లును 

హానికరమే చింత
ఉండకు దాని చెంత
తరిమి తరిమి కొట్టుము
ధైర్యంతో కాసింత

చింతించుట మానుము
సాహసమే పూనుము
దరిదాపుల ఉండక
దూరంగా త్రోయుము

చింతయే చితి మంట
కీడే దాని వెంట
ఒకసారి చేరితే!
బ్రతుకిక అధోగతే!


కామెంట్‌లు