మరువలేము మరువలేము- -గద్వాల సోమన్న,9966414580
కడుపు నింపు రైతులను
పొదుపు నేర్పు చీమలను
మరువలేము మరువలేము
విద్య దాతలు గురువులను

పంటనిచ్చు పొలములను
నీరునొసగు చెరువులను
మరువలేము మరువలేము
ఫలములొసగు తరువులను

సరిహద్దు సైనికులను
పారిశుద్ధ్య కార్మికులను
మరువలేము మరువలేము
ప్రాణం పోయు వైద్యులను

సాయపడే చేతులను
ప్రేమపంచు మనసులను
మరువలేము మరువలేము
ఆదుకునే మిత్రులను

ఆపదలో ఆప్తులను
బుద్ధి చెప్పు పెద్దలను
మరువలేము మరువలేము
కనిపెంచు తల్లిదండ్రులను

సహనం గల భూమతను
గొడుగు వంటి గగనమును
మరువలేము మరువలేము
నిప్పు,నీరు,గాలులను


కామెంట్‌లు