ఆకులుంటే అందము- -గద్వాల సోమన్న,9966414580
చెట్టుకు ఆకులు అందము
గొప్పది ఇరువురి బంధము
తెచ్చిపెట్టు నిండుదనము
పెంచుతుంది చక్కదనము

కొమ్మ కొమ్మకూ ఆకులు
ఉట్టిపడును పచ్చదనము
తరువుకవి మంచి మిత్రులు
చాటునోయ్ గొప్పతనము

కప్పును తరులను నిండుగ
ఇచ్చును రక్షణ మెండుగ
అందాలొలికే ఆకులు
చెట్టుకవి సన్నిహితులు

పచ్చని ఆకులు త్రుంచిన
ఎక్కడుండునూ కళకళ!!
పత్రాలు కనుక  రాలిన
పోవును తరువులు వెలవెల


కామెంట్‌లు